Montra Electric Cycle విడుదల
ధర రూ .27,279.
కిలోమీటర్‌కు 7పైసలే..
TI సైకిల్స్ ఆఫ్ ఇండియా తన తొలి ఎలక్ట్రిక్ సైకిల్‌ను ఆవిష్కరించింది. Montra Electric Cycle పేరుతోతో విడుదలైన ఈ సైకిల్ తక్కువ దూరంలో ప్రయాణించడానికి చాలా అనుకూలమైనది. మాంట్రా E- సైకిల్ ధర రూ .27,279 నుంచి ప్రారంభమవుతుంది. ఇది రోజువారీ ప్రయాణానికి సరిపోతుంది.
తేలికైన అల్లాయ్ ఫ్రేమ్
Montra Electric Cycle తేలికైన అల్లాయ్ ఫ్రేమ్‌తో నిర్మించారు. ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో డ్యూయల్-మోడ్ ఉంటుంది. అంటే వినియోగదారుడి సౌలభ్యం ప్రకారం పెడల్ సాయంతో సైకిల్‌ను నడపవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రిక్ మోడ్‌లోనూ ముందుకెళ్లవచ్చు. ఇందులో ఎలక్ట్రిక్ బ్రేకింగ్ సిస్టమ్ అందించడం వల్ల బ్రేకులు వేసేటప్పుడు మోటార్ పవర్ తగ్గిపోకుండా ఉంటుంది. ఇది సమర్థవంతమైన, మృదువైన బ్రేకింగ్ సిస్టంను అందిస్తుంది.
మాంట్రా ఈ-సైకిల్ తక్కువ దూరాలకు వెళ్లే వినియోగదారుల కోసం తీర్చిదిద్దబడింది. సగటున, ఇ-సైకిళ్లు కిలోమీటరుకు సగటున 7 పైసల చొప్పున నడుస్తాయి. అదే సమయంలో వాతావరణంలో కర్బన ఉద్గారాలను కూడా తగ్గిపోవడానికి ఉపయోడపడుతుంది. మరోవైపు ప్రజా రవాణా, ఇంధనం నింపడం, ట్రాఫిక్ ఇబ్బదులు కూడా ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లతో తగ్గిపోతాయి.
Montra Electric Cycles లాంచ్ గురించి ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా ఎండీ వెల్లయన్ సుబ్బయ్య వ్యాఖ్యానిస్తూ.. “స్వల్ప దూర ప్రయాణాల కోసం మాంట్రా ఇ-సైకిల్ లాంచ్ చేసినట్లు తెలిపారు. తమ కస్టమర్లు వారి గమ్యస్థానానికి వెళ్లే సమయంలో వెయిటింగ్ పీరియడ్ నుంచి వెసులుబాటు కల్పించేందుకు దీనిని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. భవిష్యత్ అంతా ఈవీలదేనని అందుకే ఇ-సైకిల్ పట్టణ ప్రయాణికులకు అత్యంత అనువైనదని తెలిపారు.
ఇటీవలి పరిశోధన ప్రకారం భారతదేశ ఇ-సైకిల్స్ మార్కెట్ 2026 నాటికి 12.69 శాతం CAGR వద్ద 2.08 మిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా ఉందని తెలిపారు.
మార్కెట్‌లో హీరో ఎలక్ట్రిక్ సైకిళ్లు, ప్యూర్ ఈవీ కంపెనీకి చెందిన పలు ఎలక్ట్రిక్ సైకిళ్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
Super
Very nice