Saturday, August 23Lend a hand to save the Planet
Shadow

Bajaj Chetak EV | కొత్త, పాత బజాజ్ స్కూటర్లలో తేడాలు ఏమున్నాయి? అదనంగా ఏ ఫీచర్లు ఉన్నాయి?

Spread the love

Bajaj Chetak EV | బజాజ్(Bajaj Auto) కొత్త చేతక్‌ను ఇటీవ‌లే రూ.1.20 లక్షల(ఎక్స్-షోరూమ్ )తో విడుదల చేసింది. అయితే చేతక్‌తో, బజాజ్ కొన్ని ముఖ్య‌మైన ఫీచ‌ర్ల‌ను జోడించింది. ఈ మార్పులు కొత్త బజాజ్ చేతక్ పాత మోడల్ నుంచి ఎలా విభిన్నంగా ఉందో ఇక్కడ మరింత వివరంగా చూడండి.

Bajaj Chetak EV — New vs old

కొలతలు : కొత్త చేతక్ దాని ఛాసిస్ ను పున‌రుద్ధ‌రించింది. ఫలితంగా 80mm పొడవైన వీల్‌బేస్ ఉంటుంది. దీంతోఫ ఫ్లోర్‌బోర్డ్ కాస్త‌ పొడవుగా ఉండి. మరింత స్పేస్ ల‌భిస్తుంది .పాత మోడల్‌తో పోలిస్తే కొత్త చేతక్ సీటు కూడా పొడవుగా ఉంటుంది. తద్వారా సీటు కింద కూడా ఎక్కువ స్టోరేజ్ అందిస్తుంది.

ఫీచర్లు

Bajaj Chetak EV Features : పాత బజాజ్ చేతక్ ఫీచర్-రిచ్ వెహికిల్, కానీ బజాజ్ అప్‌డేట్ చేసిన వెర్షన్‌తో గేమ్‌ను మరింత పెంచింది. కొత్త బజాజ్ చేతక్ టచ్ ఆపరేషన్‌లతో కూడిన TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను క‌లిగి ఉంటుంది.టర్న్-బై-టర్న్ డైరెక్షన్‌లకు బదులుగా పూర్తి నావిగేషన్, మ్యూజిక్ కనెక్టివిటీ, సీక్వెన్షియల్ ఇండికేటర్‌లు, కాల్, మెసేజ్ నోటిఫికేషన్‌లతోపాటు మరిన్నింటిని పొందుతుంది.

బ్యాటరీ ప్యాక్

బ‌జాజ్ కొత్త‌ స్కూటర్‌లోని బ్యాటరీ ప్యాక్ కూడా అతిపెద్ద అప్‌గ్రేడ్‌లలో ఒకటి. ఛాసిస్ డిజైన్‌లో మార్పుకు ఇది కూడా ఒక ప్రధాన కారణం. బ్యాటరీ ప్యాక్ ఇప్పుడు స్కూటర్ ఫ్లోర్‌బోర్డ్‌పై ఉంది. ఇది 3.5kWh యూనిట్. ఇది 153km IDC రేంజ్ ను అందిస్తుంది. చేతక్ కేవ‌లం మూడు గంటల్లో 0–80 శాతం బ్యాటరీ ప్యాక్‌ను ఛార్జ్ చేయగల ఆన్‌బోర్డ్ ఛార్జర్‌ను కూడా అందిస్తున్నారు.పాత వెర్షన్ 2.9kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది.


హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు