Home » Bajaj CNG Motorcycle : బజాజ్ సీఎన్ జీ బైక్ విడుదలయ్యేది అప్పుడే.. మైలేజీ, ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయి?

Bajaj CNG Motorcycle : బజాజ్ సీఎన్ జీ బైక్ విడుదలయ్యేది అప్పుడే.. మైలేజీ, ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయి?

Bajaj CNG Bike Bajaj CNG Motorcycle
Spread the love

Bajaj CNG Motorcycle | భారతదేశంలో మొట్టమొదటి CNG మోటార్‌సైకిల్ విడుదలయ్యే తేదీల వివరాలు అధికారికంగా వెల్లడయ్యాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బజాజ్ సీఎన్జీ బైక్  జూన్ 18, 2024న మనముందుకు రాబోతున్నది. ఆల్-కొత్త పల్సర్ NS400 విడుదల సందర్భంగా బజాజ్ ఆటో MD రాజీవ్ బజాజ్ ఈవిషయాన్ని ధృవీకరించారు. బజాజ్ CNG మోటార్‌సైకిల్‌కి Bruzer 125 CNG అని పేరు పెట్టే అవకాశం ఉంది. బజాజ్ 2016లో ‘బ్రూజర్’ కోసం ట్రేడ్‌మార్క్‌ను దాఖలు చేసింది. ఇది మాస్ మార్కెట్, ఫ్యూయల్-ఎఫిషియెన్సీ కాన్షియస్ కస్టమర్‌లను లక్ష్యంగా చేసుకుంటుంది. రాబోయే కొన్ని సంవత్సరాలలో భారతదేశంలో మరిన్ని CNG మోడల్‌లు విడుదలయ్యే అవకాశం ఉంది.

తక్కువ రన్నింగ్ ఖర్చు..

సాధారణ పెట్రోల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్‌తో పోలిస్తే, 100-125 cc విభాగంలో బజాజ్ సీఎన్జీ మోటార్‌సైకిల్‌  (Bajaj CNG bike) తక్కువ రన్నింగ్ ఖర్చులతో అత్యుత్తమ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.  బజాజ్ బ్రూజర్ 125 స్పైషాట్‌లు పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, పొడవాటి వన్-పీస్ హ్యాండిల్‌బార్, సీటు, బార్‌లు, ఫుట్‌పెగ్‌లను చూడవచ్చు. సస్పెన్షన్ సెటప్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్, మోనోషాక్ ఉన్నాయి. టెస్ట్ బైక్ డిస్క్-డ్రమ్ సెటప్‌తో అమర్చబడింది, ఇది చాలావరకు ఒకే-ఛానల్ ABSని కలిగి ఉంటుంది. బజాజ్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో డ్రమ్ బ్రేక్ సెటప్‌ను ఆఫర్ చేస్తుందని ఆశించవచ్చు.

రూ.69,9000లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు, ధర ఫుల్ డీటేయిల్స్ ఇవే..

Bajaj CNG Motorcycle ను చాలాసార్లు రోడ్లపై పరీక్షిస్తున్నప్పుడు కెమెరాలకు చిక్కింది.  ఇప్పటికే ఉన్నబజాజ్ మోడళ్లలా కాకుండా పూర్తిగా కొత్త డిజైన్ లాంగ్వేజ్‌ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. స్పైషాట్‌లు పెద్దదైన ఇంధన ట్యాంక్‌ ఉన్నట్లు ఫొటోలలను బట్టి తెలుస్తోంది. ఈ బైక్  రెండు రకాల ఇంధనాలతో అంటే పెట్రోల్ తోపాటు CNGతో నడుస్తుంది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ లో మరో CNG మోటార్‌సైకిల్ ఏదీ లేదు. బజాజ్ సరైన ధరను నిర్ణయించగలిగితే, ఎంతో మంది సీఎన్జీ బైక్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అప్పుడు Bruzer 125 CNG భారత ఆటోమొబైల్ మార్కెట్ లో గేమ్ చేంజర్గా నిలుస్తుంది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *