BattRE loev

విస్త‌ర‌ణ దిశ‌గా BattRE Ev స్టార్ట‌ప్

Spread the love

దేశ‌వ్యాప్తంగా 300 డీల‌ర్‌షిప్‌లు

2023 నాటికి 700కు చేరువ‌..

BattRE loev

భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న EV స్టార్ట‌ప్‌లలో ఒకటి BattRE Ev కంపెనీ. ఇప్ప‌టివ‌ర‌కు 19 రాష్ట్రాల్లో 300 డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసింది. FY23 పూర్త‌య్యే నాటికి 700 డీలర్‌షిప్‌లను పెంచుకోవాల‌ని కంపెనీ భావిస్తోంది. బ్యాట్రే కంపెనీ పోర్ట్‌ఫోలియోలో కొత్త‌గా రెండు సరికొత్త ప్రోడ‌క్ట్‌లు వ‌చ్చి చేరాయి. ఇందులో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌లు ఉన్నాయి. భ‌విష్య‌త్తులోనూ BattRE సరికొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను మార్కెట్లోకి తీసుకురానుంది.

300శాతం పెరిగిన ఆదాయం

కంపెనీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 450 కోట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించాల‌ని యోచిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలోని ఆదాయంతో పోలిస్తే 300 శాతం పెరిగింది. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచడానికి, డీలర్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి, కొత్త ఉత్పత్తులను ప్రారంభించేందుకు, పరిశోధన అభివృద్ధి సామర్థ్యాలను మెరుగుపరచుకోవ‌డానికి బాట్రే కంపెనీ రూ.100 కోట్ల మేర పెట్టుబడి పెట్టాల‌ని ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకుంది.

ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మార్కెట్ పరిపక్వతను పెంచుకుంటూ BattRE Ev సమీప భవిష్యత్తులో భారీ వృద్ధిని ఆశిస్తోంది. ఈ అంశంపై బ్యాట్రే వ్యవస్థాపకుడు నిశ్చల్ చౌదరి మాట్లాడుతూ “బ్యాటరీతో నడిచే ద్విచక్ర వాహనాల మార్కెట్ వృద్ధి ఇంకా పూర్తి స్థాయికి చేర‌లేద‌ని, రాబోయే 10 సంవత్సరాలలో 100 శాతం కంటే ఎక్కువ పురోగ‌తి ఉంటుంద‌ని తెలిపారు.

“ఇటీవల అనేక కొత్త సంస్థ‌లు మార్కెట్లోకి ప్రవేశించినప్పటికీ ఈ రంగంలో BattRE కి 2.5 సంవత్సరాల అనుభ‌వం ఉంది. మ‌రోవైపు కస్టమర్ల డిమాండ్‌లకు అనుగుణంగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను (electric vehicles – EV ) అందిస్తోంది. అయితే త్వరలో తాము ఇ-స్కూటర్‌ను లాంచ్ చేస్తున్నామ‌ని, ఇది EV మార్కెట్‌లో విజ‌యం సాధిస్తుంద‌ని తెలిపారు. త‌మ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌పై చేస్తున్న ప‌రీక్ష‌లు చివరి దశలో ఉన్నాయ‌ని తెలిపారు. దీనిని ఈ ఏడాది జూన్ నాటికి విడుదల చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

మరిన్ని అప్‌డేట్‌ల కోసం హ‌రిత‌మిత్ర వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు సంబంధించిన వీడియోల కోసం మా  Haritha mithra YouTube ఛానెల్‌ను స‌బ్‌స్క్రైబ్ చేసుకోండి.!

More From Author

Tork Motors నుంచి హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ బైక్‌లు

దేశంలోనే అతిపెద్ద Ev చార్జింగ్ స్టేష‌న్‌.. ఎక్కడంటే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest

Bajaj Chetak : త్వరలో నెక్స్ట్‌-జెన్ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ !

కొత్త డిజైన్‌, అధునాతన ఫీచర్లతో 2026లో మార్కెట్లోకి Chetak 2026 Launch : ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో బజాజ్ ఆటో మరోసారి సంచలనానికి సిద్ధమవుతోంది . చేతక్‌ 35 సిరీస్‌, 30 సిరీస్‌ల గ్రాండ్ స‌క్సెస్ త‌ర్వాత కంపెనీ ఇప్పుడు నెక్స్ట్‌-జెనరేషన్ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇటీవల స్పై ఫొటోలు సోష‌ల్‌మీడియాలో...