Home » దేశంలోనే అతిపెద్ద Ev చార్జింగ్ స్టేష‌న్‌.. ఎక్కడంటే..

దేశంలోనే అతిపెద్ద Ev చార్జింగ్ స్టేష‌న్‌.. ఎక్కడంటే..

Spread the love

ఒకేసారి 100 కార్లను ఛార్జ్ చేయవచ్చు

Charging station

 

 

 

 

 

ఎల‌క్ట్రిక్ ఫోర్ వీల‌ర్ వాహ‌నాల కోసం 100 ఛార్జింగ్ పాయింట్ల సామర్థ్యంతో ఇండియాలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ (EV) Charging station (ఛార్జింగ్ స్టేషన్) ను శుక్రవారం హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిలో ప్రారంభించారు. గతంలో దేశంలో అతిపెద్ద EV ఛార్జింగ్ స్టేషన్ నవీ ముంబైలో 16 AC/ 4 DC ఛార్జింగ్ పోర్ట్‌లతో ఉండ‌గా, తాజాగా గురుగ్రాంలో టెక్-పైలటింగ్ కంపెనీ అలెక్ట్రిఫై ప్రైవేట్ లిమిటెడ్ (Alektrify ) ఏర్పాటు చేసిన చార్జింగ్ స్టేష‌న్ అతిపెద్ద‌దిగా అవ‌త‌రించింది.

ఈ చార్జింగ్ స్టేష‌న్‌లో 72 AC ఛార్జర్‌లు, 24 DC ఫాస్ట్ ఛార్జర్‌లతో సహా మొత్తం 100 ఛార్జింగ్ పాయింట్‌లను కలిగి ఉంది.

ఈ స్మార్ట్ EV ఛార్జింగ్ స్టేషన్ నాలుగు చక్రాల వాహనాల కోసం 100 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. వీటిలో 72 యూనిట్లు AC స్లో ఛార్జర్‌లు కాగా, 24 యూనిట్లు DC ఫాస్ట్ ఛార్జర్‌లు ఉంటాయి. ఇది గుర్గావ్‌లోని సెక్టార్ 52లో ఉంది. దీనికి ముందు, దేశంలో అతిపెద్ద EV ఛార్జింగ్ స్టేషన్ నవీ ముంబైలో ఉంది. ఇందులో 16 AC, 4 DC ఛార్జర్లు ఉన్నాయి.

ఈ అతిపెద్ద EV ఛార్జింగ్ స్టేషన్.. ఈ ప్రాంతంలో EV పరిశ్రమను పెంచడమే కాకుండా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద EV ఛార్జింగ్ స్టేషన్‌లకు బెంచ్‌మార్క్‌గా కూడా పని చేస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పైలట్ ప్రోగ్రామ్ కింద జైపూర్-ఢిల్లీ-ఆగ్రా ఈ-హైవేపై ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి NHEV యొక్క ఇన్‌స్టాలేషన్ భాగస్వామి కంపెనీ అయిన Alektrify అనే సంస్థ ఈ ఛార్జింగ్ స్టేషన్‌ను ఇన్‌స్టాల్ చేసి మెయింట‌నెన్స్ చేస్తుంది.

NHEV వర్కింగ్ గ్రూప్ సభ్యుడు/ Alektrify ఛార్జింగ్ హబ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, “ఈ స్టేషన్‌లో ఒకేసారి 96 ఎలక్ట్రిక్ వాహనాల (EV) కోసం 96 ఆపరేషనల్ ఛార్జింగ్ పోర్ట్‌లు ఉన్నాయి. 576 ఎలక్ట్రిక్ వాహనాలకు 24 గంటలు సేవలు అందించగలవు. 1 AC ఛార్జర్ EVని ఛార్జ్ చేయడానికి 6 గంటల వరకు పడుతుంది. ఒక రోజులో మొత్తం 4 వాహనాలను ఛార్జ్ చేయగలదు.

అలాంటి 72 ఛార్జర్‌లు ప్రతిరోజూ 288 EVలను ఛార్జ్ చేయగలవు. మా వేగవంతమైన DC ఛార్జర్‌లు 2 గంటలలోపు వాహనాన్ని ఛార్జ్ చేయగలవు.  ఈ స్టేషన్‌లో ప్రతిరోజూ 12 EVలను సౌకర్యవంతంగా ఛార్జ్ చేయగలవు. పగలు-రాత్రి వినియోగంలో 288 EVలను ఛార్జ్ చేయడానికి మా వద్ద 24 DC 5KW ఛార్జర్‌లు ఉన్నాయి. అని తెలిపారు.


మరిన్ని అప్‌డేట్‌ల కోసం హ‌రిత‌మిత్ర వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు సంబంధించిన వీడియోల కోసం మా  Haritha mithra YouTube ఛానెల్‌ను స‌బ్‌స్క్రైబ్ చేసుకోండి.!

2 thoughts on “దేశంలోనే అతిపెద్ద Ev చార్జింగ్ స్టేష‌న్‌.. ఎక్కడంటే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి.. కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ
ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి.. కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ