Ev Deals | బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.24,000 డిస్కౌంట్..  ఈ ఆఫర్ కొద్దిరోజులే..

Ev Deals | బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.24,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ కొద్దిరోజులే..


Ev Deals | ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌న త‌యారీ సంస్థ బౌన్స్ ఇన్ఫినిటీ (Bounce infinity) త‌న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌పై భారీ డిస్కౌంట్ల‌ను ప్ర‌క‌టించింది. bounce E1 ఎలక్ట్రిక్ స్కూటర్లపై 21 శాతం డిస్కౌంట్ తో లిమిటెడ్ పిరియ‌డ్ ఆఫ‌ర్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ ఆఫ‌ర్ కింద కస్టమర్‌లు రూ. 89,999 ఎక్స్-షోరూమ్ ధరకే బౌన్స్ ఇన్ఫినిటీ ఇ-స్కూటర్‌లను కొనుగోలు చేయవచ్చు, అయితే దీని అసలు ధర రూ. 1.13 లక్షలు కాగా ఆఫ‌ర్ ఫ‌లితంగా ఏకంగా రూ. 24,000 డ‌బ్బులు ఆదా అవుతుంది. ఈ ఆఫర్ మార్చి 31, 2024 వరకు చెల్లుబాటులో ఉంటుంది.

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్కూటర్లకు Ev Deals  వర్తిస్తాయి.  కస్టమర్‌లు కంపెనీ వెబ్‌సైట్‌ని సందర్శించి, నామమాత్రపు టోకెన్ మొత్తం రూ. 500 చెల్లించి బుక్ చేసుకోవ‌చ్చు.

బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్పెసిఫికేష‌న్స్‌..

Bounce e1 ev specification :Bounce infinity E1 ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో 1.9 kWh రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీలు ఉంటాయి. వీటిని ప్రామాణిక 15 Amp వాల్ సాకెట్‌ని ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూర్‌ 65 kmph గరిష్ట వేగంతో దూసుకువెళ్తుంది. 2.2 kW పీక్ పవర్ మోటార్‌తో వచ్చే ఈ స్కూట‌ర్ సింగిల్ చార్జిపై 70 కిమీల వ‌ర‌కు ప్ర‌యాణించ‌వ్చు. స్కూటర్లు లిక్విడ్-కూల్డ్ బ్యాటరీ టెక్నాలజీ, ఫాస్ట్ ఛార్జింగ్, ఎక్స్ టెండెడ్ రేంజ్, స్మార్ట్ కనెక్టివిటీ వంటి ఫీచ‌ర్ల‌ను కూడా కలిగి ఉంటాయి.

బౌన్స్ ఇన్ఫినిటీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70కి పైగా డీలర్‌షిప్‌లను కలిగి ఉంది. ఆఫర్‌లను ఈ డీలర్‌షిప్‌లలో దేనిలోనైనా పొందవచ్చు. ఇతర వార్తలలో, బౌన్స్ ఇన్ఫినిటీ సన్ మొబిలిటీ నుండి 30,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ప్రధాన ఆర్డర్‌ను పొందింది.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Harithamithra

👉 “Eco friendly & environmental news updates for Free”

వ్యవసాయం, సోలార్​​ ఎనర్జీ, గ్రీన్​ మొబలిటికి సంబంధించిన అప్‌డేట్స్​ను ఉచితంగా పొందండి!"

We don’t spam! Read our privacy policy for more info.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🌱 పర్యావరణ వార్తలు వెంటనే తెలుసుకోండి!

Green Mobility, Solar, EV, Environment కి సంబంధించిన తాజా వార్తలు కోసం Harithamitra ను Follow అవ్వండి.

♻️ Harithamitra – పర్యావరణానికి మీ డిజిటల్ మిత్రుడు