Home » Fame II subsidies | ఎలక్ట్రిక్ స్కూటరలను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఇంకా కొద్దిరోజులే సమయం!

Fame II subsidies | ఎలక్ట్రిక్ స్కూటరలను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఇంకా కొద్దిరోజులే సమయం!

EV News
Spread the love

Fame II subsidies on electric vehicles | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకసారి త‌న ప్ర‌సంగంలో “యాహీ సమయ్ హై, స‌హి సమయ్ హై” అని అన్నారు. ఆయన  మాటలు వేరే సందర్భం కోసం అన్న‌ప్ప‌టికీ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఈ మాటలు స‌రిగ్గా స‌రిపోయి. మీకు ఇష్టమైన ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్‌ను త‌క్కువ ధ‌ర‌లో కొనుగోలు చేసే అవకాశాన్ని చేజిక్కించుకోవడానికి బ‌హుషా మీకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండవచ్చు. దీని వెను కార‌ణాలేంటో ఇపుడు తెలుసుకోండి..

దేశంలో ప‌ర్యావ‌ర‌ణ అనుకూల‌మైన ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర‌చ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ, అమ్మ‌కాలను ప్రోత్స‌హిస్తోంది. ఇందుకోసం Fame II subsidies తీసుకొచ్చి ఈవీల‌పై భారీగా సబ్సిడీ అందిస్తోంది.
అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ FAME సబ్సిడీని కొన‌సాగిస్తుందా లేదా అనేదానిపై అనిశ్చితి నెల‌కొంది. మార్చి 31, 2024 వరకు విక్రయించబడిన ఇ-వాహనాలకు FAME పథకం రెండవ దశ కింద రాయితీలు అందుబాటులో ఉంటాయని కేంద్ర ప్ర‌భుత్వం ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రీ వీల‌ర్స్‌, ఫోర్ వీల‌ర్స్ కోసం FAME ప‌థ‌కం కింద‌ కేవలం రూ. 7,048 కోట్లు కేటాయించింది. ఇంకా వారం రోజుల‌వ‌ర‌కు ఈ ప‌థ‌కం అమ‌లులో ఉండ‌నుంది. దీనిని మ‌ళ్లీ కొన‌సాగించ‌క‌పోతే.. స‌బ్సిడీ వ‌ర్తించ‌దు. అందుకే త్వరితగతిన నిర్ణ‌యం తీసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

ధరలు తగ్గించిన ఈవీ కంపెనీలు

ఇదిలా ఉండ‌గా ఒకాయ, ఓలా ఎలక్ట్రిక్, బౌన్స్ ఇన్ఫినిటీ వంటి ప్రముఖ EV తయారీదారులు కూడా ఈ నెలలో మాత్రమే ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించారు.

Okaya రూ. 18,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇది ఫిబ్రవరి 29, 2024 వరకు చెల్లుబాట‌లో ఉంటుంది. ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌లు ఇప్పుడు రూ. 74,899 నుండి ప్రారంభమవుతాయి, ఒక్కో ఛార్జ్‌కు 75 కిమీ రేంజ్‌ను కలిగి ఉంటుంది. Okaya Faast F4 మోడల్, ఒక్కో ఛార్జ్‌కి 140 నుండి 160 కిమీల మైలేజీ ఇస్తుంది. ఇప్పుడు ఇది 1,37,990 నుండి రూ.1,19,990 వ‌ర‌కు త‌గ్గింది. ఈ మోడల్‌లో రెండు బ్యాటరీలు ఉంటాయి, మొత్తం 4.4 kWh బ్యాట‌రీ ప్యాక్ ఉంటుంది. ఇది పరిశ్రమలో అత్యధిక బ్యాటరీ కెపాసిటీ.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్

ఓలా తన S1 స్కూట‌ర్ల శ్రేణి ధరలను కూడా రూ.25,000 వ‌ర‌కు తగ్గించింది. Ola S1 X+ అసలు ధర ఇది రూ. 1.09 లక్షలు కాగా డిస్కౌంట్ ఆఫ‌ర్ లోభాగంగా ఇప్పుడు రూ. 84,999 లకు అందుబాటులో ఉంది. అదేవిధంగా, Ola S1 ఎయిర్ ధర రూ. 1.19 లక్షల నుండి రూ. 1.05 లక్షలకు తగ్గించారు. అయితే Ola S1 ప్రో ధ‌ర రూ. 1.48 లక్షలు కాగా ప్ర‌స్తుతం రూ. 1.30 లక్షలకు అందుబాటులో ఉంది. అయితే, ఈ డిస్కౌంట్లు ఈ నెలాఖ‌రు వ‌ర‌కు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఓలా పేర్కొంది.

READ MORE  Free Solar Power | తెలంగాణలో 22 గ్రామాలకు ఉచితంగా సోలార్ కరెంట్..!

బౌన్స్ స్కూటర్లపై 24000 తగ్గింపు

ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌న త‌యారీ సంస్థ బౌన్స్ ఇన్ఫినిటీ (Bounce infinity) త‌న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌పై భారీ డిస్కౌంట్ల‌ను ప్ర‌క‌టించింది. bounce E1 ఎలక్ట్రిక్ స్కూటర్లపై 21 శాతం డిస్కౌంట్ తో లిమిటెడ్ పిరియ‌డ్ ఆఫ‌ర్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ ఆఫ‌ర్ కింద కస్టమర్‌లు రూ. 89,999 ఎక్స్-షోరూమ్ ధరకే బౌన్స్ ఇన్ఫినిటీ ఇ-స్కూటర్‌లను కొనుగోలు చేయవచ్చు, అయితే దీని అసలు ధర రూ. 1.13 లక్షలు కాగా ఆఫ‌ర్ ఫ‌లితంగా ఏకంగా రూ. 24,000 డ‌బ్బులు ఆదా అవుతుంది. ఈ ఆఫర్ మార్చి 31, 2024 వరకు చెల్లుబాటులో ఉంటుంది.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్కూటర్లకు Ev Deals వర్తిస్తాయి. కస్టమర్‌లు కంపెనీ వెబ్‌సైట్‌ని సందర్శించి, నామమాత్రపు టోకెన్ మొత్తం రూ. 500 చెల్లించి బుక్ చేసుకోవ‌చ్చు.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *