Home » మార్చి 5న BYD Seal EV లాంచ్‌.. దీని ధరలు, స్పెసిఫికేషన్లు ఇవే..

మార్చి 5న BYD Seal EV లాంచ్‌.. దీని ధరలు, స్పెసిఫికేషన్లు ఇవే..

BYD Seal India launch
Spread the love

BYD Seal India launch | ప్ర‌ముఖ ఆటోమొబైల్ సంస్థ BYD Auto తన ఈవీ పోర్ట్‌ఫోలియోను విస్త‌రిస్తోంది. ఈమేర‌కు భారతదేశంలో మూడవ మోడల్.. Seal ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ ను మార్చి 5న లాంచ్ చేయడానికి స‌న్నాహాలు చేస్తోంది. కాగా BYD India లైనప్‌లో ఇప్ప‌టికే Atto 3 SUV, e6 MPV వాహ‌నాలు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ సీల్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఇటీవల చెన్నై శివార్లలోని ర‌హ‌దారుల‌పై ప‌రీక్షించిన వీడియోలు, ఫొటోలు వైర‌ల్ అయ్యాయి.. డీలర్లు ఇప్పటికే ఈ కొత్త‌ మోడల్ కోసం బుకింగ్‌లను ప్రారంభించారు.

BYD సీల్ ఇండియా లాంచ్ వివరాలు

BYD Seal India launch details : సీల్ సెడాన్ అంతర్జాతీయ మార్కెట్లో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్ష‌న్ల‌లో అందుబాటులో ఉంది. అందులో మొద‌టిది 61.4kWh యూనిట్.. ఇది గ‌రిష్టంగా 500km CLTC రేంజ్ ను అందిస్తుంది. రెండోది 82.5kWh బ్యాటరీ వేరియంట్.. ఇది 700km రేంజ్ ఇస్తుంది. ఇదే వేరియంట్ ను భారతదేశంలో ప్ర‌వేశ‌పెట్టే అవకాశముంది.

READ MORE  Tata Festival of Cars | టాటా ఎల‌క్ట్రిక్ కార్ల‌పై భారీ ఆఫ‌ర్ Nexon.ev, Punch.ev ల‌పై రూ. 3 లక్షల వరకు ధర తగ్గింపు

BYD పేటెంటెడ్ ‘బ్లేడ్ బ్యాటరీ (Blade Battery)’ సాంకేతికతను కలిగి ఉన్న బ్యాట‌రీ.. రెండు మోటార్లకు శక్తినిస్తుంది. ఇది 150kW వరకు ఫాస్ట్‌ ఛార్జ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. వాహనంలోని మోటార్ 530hp మరియు 670Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. BYD సీల్ 3.8 సెకన్లలోనే 0-100kph వేగాన్ని అందుకుంటుంది. ఇక స్పీడ్ విష‌యానికొస్తే గంట‌కు 180kph వేగంతో దూసుకుపోతుంది. ఇది దాదాపు 2.2 టన్నుల బరువున్న కారుకు చాలా మంచిది.

BYD Seal EV డైమెన్ష‌న్స్ 4,800mm పొడవు, 1,875mm వెడల్పు, 1,460mm ఎత్తు ఉంటుంది. వీల్‌బేస్ 2,920mm ఉంటుంది. ఈ ఎల‌క్ట్రిక్ సెడాన్ లో 400-లీటర్ బూట్ స్పేస్‌, 53-లీటర్ ఫ్రంక్ కలిగి ఉంది.

సీల్ స్పోర్ట్స్ BYD డిజైన్ లాంగ్వేజ్ ఓష‌న్ థీమ్ ను కలిగి ఉంది. దాని కూపే లాంటి ఆల్-గ్లాస్ రూఫ్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, నాలుగు బూమరాంగ్ ఆకారపు LED DRLలు, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్ తో వ‌స్తుంది. వెనుకవైపు ఫుల్‌-వెడల్పు LED లైట్ బార్ తో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది.

READ MORE  Tata Festival of Cars | టాటా ఎల‌క్ట్రిక్ కార్ల‌పై భారీ ఆఫ‌ర్ Nexon.ev, Punch.ev ల‌పై రూ. 3 లక్షల వరకు ధర తగ్గింపు

BYD సీల్ ధర అంచనా..

BYD Seal price in India BYD (అంచ‌నా) : బీవైడీ సీల్ ఎల‌క్ట్రిక్ సెడాన్ ధరలు రూ. 50 లక్షల (ఎక్స్-షోరూమ్) మ‌ధ్య ఉండవచ్చని భావిస్తున్నారు. మార్చి 5న ధరలు ప్రకటించిన తర్వాత సీల్ EV డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయని డీలర్లు వెల్లడించారు.

ఇదిలా ఉండగా బీవైడీ సీల్‌కు ప్ర‌స్తుతం ఈవీ మార్కెట్ లో ప్రత్యర్థులు ఏవీ లేకపోయినా, దాని ధర పాయింట్‌ను పరిగణనలోకి తీసుకుంటే, EV హ్యుందాయ్ ఐయోనిక్ 5 SUV , కియా నుంచి వచ్చిన EV6 క్రాస్‌ఓవర్ వంటివి పోటీగా నిల‌వొచ్చు.

READ MORE  Tata Festival of Cars | టాటా ఎల‌క్ట్రిక్ కార్ల‌పై భారీ ఆఫ‌ర్ Nexon.ev, Punch.ev ల‌పై రూ. 3 లక్షల వరకు ధర తగ్గింపు

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy,  Organic Farming, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే ఎలక్ట్రిక్, హైడ్రోజన్, సీఎన్ జీ వాహనాలకు సంబంధించిన  అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *