Canopus Electric Scooters : SRAM & MRAM. ATD గ్రూప్‌ల జాయింట్ వెంచర్ కానోపస్ (Canopus ) ఎలక్ట్రిక్ స్కూటర్‌లను తయారీపై దృష్టి పెట్టింది. దీని ప్రధాన కార్యాలయం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉంది. ఈ సంస్థ EV విభాగంలో దశలవారీగా సుమారు రూ.100 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ప్రోటోటైప్‌లు సిద్ధంగా ఉన్నాయి. కంపెనీ భారతదేశమంతటా డీలర్ నెట్‌వర్క్‌ను విస్తరించే దిశగా ముందుకు సాగుతోంది. మార్చి 2022 నాటికి ఈ వాహనాలు మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి.
కాగా కొత్త స్కూటర్లు కిలోమీటరుకు 20 పైసల కంటే తక్కువ రన్నింగ్ ఖర్చును అందిస్తాయని కంపెనీ పేర్కొంది. ఇంకా, Canopus భారతదేశం అంతటా ATD గ్రూప్ కంపెనీ అయిన ATD FINANCE నుంచి ఫైనాన్సింగ్ అందిస్తుంది.
నాలుగు కొత్త స్కూటర్లు
Canopus భారతదేశంలో నాలుగు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌లను విడుదల చేయనుంది. కొత్త మోడల్స్ పేర్లు అరోరా(Arora), స్కార్లెట్(scarlett), కొలెట్(colette) అలాగే వలేరియాvaleria). కొత్త ప్రొడక్ట్స్ ట్రాన్స్‌మిషన్ కోసం CAMIVT, కంట్రోలర్ కోసం FOC టెక్నాలజీ వంటి పేటెంట్ పొందిన జర్మన్, కొరియన్ టెక్నాలజీలను వినియోగించినట్లు కనోపస్ పేర్కొంది. ఇది అత్యంత సమర్థవంతమైన ఎనర్జీ ప్రొటెక్షన్ వ్యవస్థను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.
కన్సల్టెన్సీ కోసం వివిధ సాంకేతిక సంస్థలతో టైఅప్ అయినట్లు కంపెనీ ప్రకటించింది. కెనోపస్ R&D కేంద్రం అహ్మదాబాద్‌లో స్థాపించబడింది. కంపెనీ దాని ఉత్పత్తులను రాజస్థాన్‌లో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఏప్రిల్ 2022 నుండి 99% స్వదేశీ వనరులతో స్కూటర్‌లను ఉత్పత్తి చేయడాన్ని ప్రారంభిసతున్నట్లు తెలిపింది.
జియోఫెన్సింగ్, GPS ట్రాకింగ్
కానోపస్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో మెరుగైన డేటా కోసం IoT-ఆధారిత టెలిమాటిక్స్‌ని వినియోగించారు. ఇది స్మార్ట్ TFT డాష్‌బోర్డ్, మొబైల్ యాప్‌ని కూడా కలిగి ఉంటుందిజ ఇది డ్రైవర్.. డ్రైవింగ్ స్టైల్, , బ్యాటరీ స్థితి, రైడింగ్ మోడ్‌లు ఇతర సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. కానోపస్ స్కూటర్‌లు జియోఫెన్సింగ్, GPS ట్రాకింగ్, మహిళా రైడర్‌ల కోసం ఉద్దేశించిన SOS ఫీచర్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ మొదలైన ఫీచర్లు కలిగి ఉంటాయి.
బ్యాటరీ, ఛార్జింగ్
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లలో బ్యాటరీ ఛార్జింగ్ సమయం 4-5 గంటలు ఉంటుంది. అయితే, త్వరలో కేవలం 30 నిమిషాల్లో 80% ఛార్జీని అందించేలా అప్‌గ్రేడ్ చేయబడుతుందని కంపెనీ పేర్కొంది. ఇది బ్యాటరీని మార్చడం లేదా మార్చుకోవడం వంటి ఎంపికతో కూడా వస్తుంది. మరోవైపు సమీప ఛార్జింగ్ స్టేషన్ సమచారాన్ని కంపెనీ అధికారిక యాప్‌లో అందుబాటులో ఉంటుంది. . బ్యాటరీల శక్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కొరియన్ విండ్ పవర్ టెక్నాలజీని ఉపయోగించనున్నామని, అందువల్ల స్కూటర్ రేంజ్‌ను పెంచుతామని కంపెనీ పేర్కొంది.
SRAM & MRAM గ్రూప్ ప్రతినిధి శైలేష్ లచ్చు హీరానందని మాట్లాడుతూ, కానోపస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రారంభంతో మేము ఈ కొత్త విభాగంలోకి చాలా విజయవంతంగా పురోగమిస్తామని తెలిపారు.
ATD గ్రూప్ ప్రతినిధి మనోరంజన్ మొహంతి మాట్లాడుతూ “తక్కువ ధరలతో పెద్ద సంఖ్యలో EVలను ఉత్పత్తి చేయడం ద్వారా ఈవీరంగం అభివృద్ధి జరుగుతుదని ఆశిస్తున్నామని తెలిపారు.
Canopus Electric Scooters లతో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందుతారు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో అత్యుత్తమ బైక్‌లు స్కూటర్‌లను ఉత్పత్తి చేస్తూనే పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలను సృష్టించగలుగుతామని చెప్పారు.