Sunday, December 8Lend a hand to save the Planet
Shadow

ఆ నగరాల్లో EV charging stations పెరిగాయ్..

Spread the love

దేశంలో కొన్నాళ్లుగా ఇంధ‌న ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్న క్ర‌మంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడ‌కం పెరుగుతోంది.  ఈవీల‌పై ఉన్న డిమాండ్ కారణంగా EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు కూడా పెరుగుతూ వ‌స్తున్నాయి.  గత నాలుగు నెలల్లో తొమ్మిది ప్రధాన నగరాల్లో పబ్లిక్ EV ఛార్జింగ్ స్టేషన్ల (EV charging stations) సంఖ్య 2.5 రెట్లు పెరిగిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ముఖ్యంగా ఈ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌, సూరత్, పూణె, అహ్మదాబాద్, బెంగళూరు సహా ఇత‌ర ప్రధాన మెట్రో నగరాల్లో ఎక్కువ‌గా ఉన్నాయి.

భారతదేశంలో ప్రస్తుతం 1,640 పబ్లిక్ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 940  Charging stations ఛార్జింగ్ స్టేషన్లు పైన పేర్కొన‌బ‌డిన నగరాల్లో విస్తరించి ఉన్నాయి. విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకారం భారతదేశం ఈ తొమ్మిది నగరాల్లో అక్టోబర్ 2021 నుంచి జనవరి 2022 మధ్య 678 పబ్లిక్ EV ఛార్జింగ్ స్టేషన్‌లు ఏర్పాట‌య్యాయి.

విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరి 14న EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం ఏకీకృత మార్గదర్శకాలు, నియ‌మాల‌ను జారీ చేసింది.

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ఈవీ మొబిలిటీని ప్రోత్సహించేందుకు కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.  పబ్లిక్ EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలలో విస్తరణతో భారతీయ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని పేర్కొంది.   BEE, EESL, PGCIL, NTPC వంటి వాటితో సహా ప్రైవేట్, పబ్లిక్ ఏజెన్సీలను భాగస్వామ్యం చేయడం ద్వారా పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్రం అనేక ప్రయత్నాలు చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.  చాలా ప్రైవేట్ సంస్థలు కూడా EV ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి.

ముందుకు వ‌స్తున్న ఆయిల్ కంపెనీలు

రాబోయే రోజుల్లో దశలవారీగా ఇతర నగరాలకు ఈవీ చార్జింగ్ స్టేష‌న్ల‌ను కవరేజీని విస్తరించాలని కేంద్రం యోచిస్తోంది.  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ( Indian Oil Corporation – IOCL), భారత్ పెట్రోలియం (Bharat Petroleum BPCL ) వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు కూడా నగరాలు, ఇండియ‌న్ రోడ్స్‌పై సుమారు 22,000 EV ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇందులో IOC 10,000 EV ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. అలాగే BPCL మరో 7,000 EV ఛార్జర్లను ఏర్పాటు చేస్తోంది. ఇక హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL) కూడా 5,000 చార్జింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేయ‌నుంది.

IOCL ఇప్పటికే 439 EV ఛార్జింగ్ స్టేషన్‌లను ఇన్‌స్టాల్ చేసింది. వచ్చే ఏడాదిలో మరో 2,000ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. BPCL 52 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, HPCL ఇప్పటివరకు 382 ఛార్జింగ్ స్టేషన్లను ఇన్స్టాల్ చేసింది.

భారీ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో..

భారీ పరిశ్రమల శాఖ ఇటీవల 25 హైవేలు & ఎక్స్‌ప్రెస్‌వేల కోసం 1,576 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లను మంజూరు చేసింది, ఇవి ఈ హైవేలకు ఇరువైపులా ప్రతి 25 కి.మీ పరిధిలో ఉంటాయి.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *