
Amara Raja | దివిటిపల్లిలో అమరరాజా ఈవీ బ్యాటరీ తయారీ పరిశ్రమ..
Amara Raja Giga Factory in Divitipalli | తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్‌లో నాలుగు తయారీ యూనిట్లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ వేడుకలో భాగంగా, అమర రాజా కంపెనీ రాబోయే గిగా ఫ్యాక్టరీ-1 (Amara Raja Giga Factory 1) , లోహమ్ కంపెనీ కీలకమైన ఖనిజ శుద్ధి, బ్యాటరీ రీసైక్లింగ్ యూనిట్, స్సెల్ ఎనర్జీ సెల్ కేసింగ్ తయారీ యూనిట్, ఆల్ట్‌మిన్‌లోని మొదటి LFP-CAM గిగా ఫ్యాక్టరీలకు శంకుస్థాపనలు చేసినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా అశ్వినీ వైష్ణవ్ (Union Minister Ashwini Vaishnaw) మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రభుత్వానికి ప్రధాన కేంద్రంగా ఉందని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ప్రచారం, స్వీకరణ కోసం సరైన మౌలిక సదుపాయాలు, పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. భారతీయ ఆవిష్కరణలు, తయారీ ప్రయత్న...