Friday, March 21Lend a hand to save the Planet
Shadow

Ultraviolette Shockwave | స్పోర్టీ డిజైన్ తో అల్ట్రావయోలెట్ షాక్‌వేవ్ ఎండ్యూరో బైక్

Spread the love

Ultraviolette Shockwave E-bike | అల్ట్రావయోలెట్ ఈ రోజు తన రెండవ ఎల‌క్ట్రిక్ టూ వీల‌ర్ (Electric Two wheeler) అయిన షాక్‌వేవ్ ఎండ్యూరో ఇ-బైక్‌ను విడుదల చేసింది, దీని ధర రూ. 1.75 లక్షలు(ఎక్స్-షోరూమ్). అల్ట్రావయోలెట్ షాక్‌వేవ్‌ను మొదటి 1,000 మంది కస్టమర్లు రూ. 1.50 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఇదే స‌మ‌యంలో అల్ట్రావ‌యోలెట్ కంపెనీ షాక్‌వేవ్ ఎల‌క్ట్రిక్ బైక్‌తో పాటు టెస్సెరాక్ట్ ఇ-స్కూటర్ (Tesseract e-scooter) ను ప్రారంభించింది. ఇది 261 కిలోమీట‌ర్ల రేంజ్ ఇస్తుందని పేర్కొంది.

Ultraviolette Shockwave : మరిన్ని వివరాలు

అల్ట్రావయోలెట్ షాక్‌వేవ్ ప్రత్యేకంగా ఆఫ్-రోడ్, రోడ్‌స్టర్ మోటార్‌సైకిళ్ల కోసం అభివృద్ధి చేయబడిన కొత్త ప్లాట్‌ఫామ్ పై నిర్మించారు. ఫ్రేమ్ లాంగ్-ట్రావెల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక భాగంలో మోనోషాక్, 19-అంగుళాల ముందు టైర్‌.. 17-అంగుళాల వెనుక టైర్స్ ను చూడ‌వ‌చ్చు. మొత్తంమీద, మోటార్‌సైకిల్ ర్యాలీ-రైడ్ మోటార్‌సైకిళ్ల నుండి ప్రేరణ పొందినట్లుగా కనిపిస్తుంది.

Ultraviolette షాక్‌వేవ్ ఎల‌క్ట్రిక్ బైక్ లో 4kWh బ్యాటరీ ప్యాక్ ను అమ‌ర్చారు. ఇది 165km IDC రేంజ్ ను అందిస్తుంద‌ని కంపెనీ పేర్కొంది. ఇంకా ఈ బైక్ (E-bike)2.9 సెకన్లలో 0–60kmph వేగాన్ని అందుకోగలదు. అదే సమయంలో ఇది 120 kmph గరిష్ట వేగాన్ని చేరుకోగలదు. ఇది ఒక ఆహ్లాదకరమైన మోటార్‌సైకిల్‌గా మారుతుంది. ఉత్సాహానికి తోడుగా, ఈ మోటార్ నుంచి 505Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి అవుతుంది. ఇది కేవలం 120 కిలోల బరువుతో 14.5bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

నాలుగు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్‌లు, స్విచ్ చేయగల డ్యూయల్-ఛానల్ ABS, ఆరు స్థాయిల డైనమిక్ రీజెనరేషన్ వంటి అనేక ఎలక్ట్రానిక్ అసిస్టెంట్స్‌ కూడా ఉన్నాయి. షాక్‌వేవ్ రెండు రంగులలో లభిస్తుంది – కాస్మిక్ బ్లాక్ మరియు ఫ్రాస్ట్ వైట్, అయితే మోటార్‌సైకిల్ (Electric Motor Cycle) కోసం బుకింగ్‌లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభించారు. టెస్సెరాక్ట్‌తో పాటు 2026 మొదటి త్రైమాసికం నుంచి అల్ట్రావయోలెట్ షాక్‌వేవ్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి.


హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..