Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Green Mobility

Green Mobility | ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా 3,000 ఎలక్ట్రిక్ బస్సులు

Green Mobility | ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా 3,000 ఎలక్ట్రిక్ బస్సులు

Green Mobility
Green Mobility | హైదరాబాద్‌ను కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు కాలుష్య నియంత్రణపై త్వరలోనే సమగ్రమైన విధానం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) వెల్లడించారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఓఆర్‌ఆర్‌ (ORR) పరిధిలో కొత్తగా 3000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్టు ఆయన తెలిపారు.నగరంలోని రవాణా శాఖ కమిషనర్ కార్యాలయానికి తొలిసారి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్లకు (AMVI) నియామక పత్రాలను అందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గడిచిన పది నెలల్లో ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలను వివరించారు.మూసీ పునరుజ్జీవం అందరి బాధ్యతనగరంలో కాలుష్యం తగ్గించడం, మూసీ (Musi) పునరుజ్జీవం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోలను అందుబా...
వరంగల్ రీజియన్‌లో ఆర్టీసీ త్వరలో 82 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

వరంగల్ రీజియన్‌లో ఆర్టీసీ త్వరలో 82 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

Green Mobility
New Electric Buses: వరంగల్ రీజియన్‌లో టీజీఎస్ఆర్టీసీ త్వరలో 82 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. హైదరాబాద్, నిజామాబాద్, ఏటూరునాగారం, మంగపేట, ఖమ్మం, భూపాలపల్లి రూట్లలో కొత్తగా 82 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు టీజీఆర్టీసీ అధికారులు తెలిపారు.ఎలక్ట్రిక్ బస్సుల్లో సూపర్ లగ్జరీ (18), డీలక్స్ (14), సెమీ డీలక్స్ (21), ఎక్స్‌ప్రెస్ (29) ఉన్నాయి. ఢిల్లీకి చెందిన JBM కంపెనీ ఈ బస్సులను కాంట్రాక్ట్ (Gross cost contract) ప్రాతిపదికన నడపడానికి అంగీకరించింది. గ్రేటర్ వరంగల్ రీజియన్ పరిధిలోని బస్సులను నిర్వహిస్తున్న వరంగల్-2 డిపోలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో 41 సీటింగ్ సామర్థ్యం, ​​డీలక్స్‌లో 2+2 సీటింగ్ ప్యాటర్న్‌లో 45 సీట్లు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 2+3 సీటింగ్ ప్యాటర్న్‌లో 55 సీట్లు ఉంటాయని, ముందు, వెనుక ఎయిర్ సస్పెన్షన్ ఉంటుందని అధికారులు తెలిపారు....
Best CNG Cars | ఈ రెండు సీఎన్జీ కార్లలో.. ఏది ఉత్తమమైనదో మీరే తెలుసుకోండి

Best CNG Cars | ఈ రెండు సీఎన్జీ కార్లలో.. ఏది ఉత్తమమైనదో మీరే తెలుసుకోండి

Green Mobility
Nexon CNG vs Maruti Brezza CNG | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నెక్సాన్ CNG వేరియంట్ ను ఎట్టకేలకు టాటా మోటార్స్ విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో దీనిని ప్రదర్శించారు. మల్టీ పవర్‌ట్రెయిన్ ఎంపికలను అందించే భారతీయ మార్కెట్లో నెక్సాన్ మాత్రమే పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, ఇప్పుడు CNG వేరియంట్ల‌లో అంబాటులో ఉంది. దీని సెగ్మెంట్ లీడర్, మారుతి సుజుకి బ్రెజ్జా CNGకి గ‌ట్టి పోటీనిస్తోంది.రెండు CNG కాంపాక్ట్ SUVల స్పెక్స్ ప‌రిశీలించుకొని ఏది బెస్ట్ (Best CNG Cars ) అనేది అంచ‌నా వేసుకోండి.. Nexon CNG vs Maruti Brezza CNG ధరలు టాటా మోటార్స్ Nexon CNG ని రూ. 8.99 లక్షల నుంచి రూ. 14.59 లక్షల వరకు ఎక్స్-షోరూమ్‌కి విడుదల చేసింది. టాటా SUV ప్రధానంగా నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, ఫియర్‌లెస్. ఇక మారుతి సుజికీ బ్రెజ్జా CNG...
TGSRTC Electric Buses | రోడ్లపైకి కొత్త‌గా 500 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు.. హైదరాబాద్ లో ఇక డీజిల్ బస్సులు ఉండవు..

TGSRTC Electric Buses | రోడ్లపైకి కొత్త‌గా 500 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు.. హైదరాబాద్ లో ఇక డీజిల్ బస్సులు ఉండవు..

General News, Green Mobility
TGSRTC Electric Buses | హైదరాబాద్ మహానగరం క్రమంగా డీజిల్ బస్సులను తగ్గించి వాటి స్థానంలో విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. భవిష్యత్ లో   హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల ఒక్క డీజిల్ బస్సు కూడా ఉండకుండా ప్రణాళికలు చేస్తున్నామ‌ని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  వెల్లడించారు. ఈమేరకు కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎండీ వి.సి సజ్జనార్, ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, డాక్టర్ సంజయ్ లతో కలిసి ర‌వాణా, బిసీ సంక్షేమ‌శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఆదివారం ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు.pic.twitter.com/bh69GJsWiY — VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) September 29, 2024ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ 500 ఎల‌క్ట్రిక్ బ‌స్సు (TGSRTC Electric Buses) ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈసంద‌ర్భంగా మంత్రి పొన్నం మా...
Ethanol News: BPCL నుండి దేశవ్యాప్తంగా 4,279 ఇథనాల్ పెట్రోల్ స్టేషన్లు

Ethanol News: BPCL నుండి దేశవ్యాప్తంగా 4,279 ఇథనాల్ పెట్రోల్ స్టేషన్లు

Green Mobility
Ethanol News | దేశవ్యాప్తంగా సుస్థిరమైన రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు, గ్రీన్ మొబిలిటీని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) తన E20 ఫ్యూయల్ స్టేషన్లను  విస్తరించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది  . E20 పెట్రోల్ అంటే (20% ఇథనాల్ మిళితం) 20% అన్‌హైడ్రస్ ఇథనాల్ మిశ్రమం, 80% మోటారు గ్యాసోలిన్ కలిపి E20  పెట్రోల్ గా తయారుచేస్తారు BPCL యొక్క E20 నెట్‌వర్క్ 4,279 ఇంధన స్టేషన్‌లకు విస్తరించింది, ఇది కంపెనీ మొత్తం స్టేషన్లలో  18% కవర్ చేస్తుంది, భారతదేశ ప్రయాణాన్ని హరిత భవిష్యత్తు వైపు నడిపిస్తుంది.పెట్రోల్, డీజిల్   దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించడం, కొత్త ఉద్యోగాలను సృష్టించడం, రైతులకు మెరుగైన వేతనం అందించడం, పర్యావరణ ప్రయోజనాలను అందించడం. వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులను మెరుగుపరచడం వంటి అనేక కీలక లక్...
CNG kit Installation | CNG కిట్‌ని ఇన్‌స్టాల్ చేసే ముందు ఈ 5 విషయాలు మర్చిపోకండి..

CNG kit Installation | CNG కిట్‌ని ఇన్‌స్టాల్ చేసే ముందు ఈ 5 విషయాలు మర్చిపోకండి..

Green Mobility, Special Stories
CNG kit Installation | పెట్రోలు, డీజిల్ ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ ఖర్చులు ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఖ‌ర్చుల భారం తగ్గించుకునేందుకు ప్ర‌స్తుతం హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలు, CNG (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) వంటి అనేక ప్రత్యామ్నాయ ఇంధన ఎంపికలు ఉన్నాయి. వీటిలో CNG వాహ‌నాల‌పై ఇటీవ‌ల కాలంలో ఆద‌ర‌ణ పెరుగుతోంది. వాహ‌న కంపెనీలు కూడా త‌మ కొత్త వాహ‌నాల‌ను సీఎన్జీ వేరియంట్ల‌ను కూడా తీసుకువస్తున్నాయి. ఇది సుర‌క్షిత‌మైన‌ద‌ని, సమర్థవంతమైనదని, అలాగే పొదుప అయిన‌వ‌ని నిరూపిత‌మైంది. CNG కార్లు స్టాండర్డ్ పెట్రోల్ కంటే కొంచెం ఎక్కువ ధర ఉన్నప్పటికీ, అదనపు ధర సాధారణంగా 2 నుండి 3 సంవత్సరాలలోపు తిరిగి పొందవచ్చు. మీరు కిట్‌ను రీట్రోఫిట్ చేయడానికి మీ పెట్రోల్ కారుని సమీపంలోని అధికారిక CNG డీలర్ వద్దకు తీసుకెళ్లే ముందు, గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి.. అన్ని కార...
CNG two-wheeler | త్వరలో TVS నుంచి సీఎన్జీ స్కూటర్.. జూపిటర్ స్కూటర్ ఇక సీఎన్జీ వేరియంట్ లో..

CNG two-wheeler | త్వరలో TVS నుంచి సీఎన్జీ స్కూటర్.. జూపిటర్ స్కూటర్ ఇక సీఎన్జీ వేరియంట్ లో..

Green Mobility
CNG two-wheeler | ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్ అయిన బ‌జాజ్‌ ఫ్రీడమ్ 125 ని గత వారం విడుదల చేసిన విష‌యం తెలుసిందే.. ఇంకా ఇది మార్కెట్‌లో అమ్మ‌కానికి రాలేదు. అయిన‌ప్ప‌టికీ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ పై ఇప్పటికే భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్ లో అలాగే ఇంటర్నెట్‌లో సంచ‌న‌లం రేపుతోంది. బైక్ డిజైన్‌, మైలేజీ విష‌యంలో అంద‌రూ మెచ్చుకుంటున్నారు. ఇది భారతదేశంలోని ఇతర ద్విచక్ర వాహన కంపెనీల్లో విశ్వాసాన్ని పెంచింది. ఇదిలా ఉండ‌గా దేశంలోని మూడో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ అయిన టీవీస్ మోటార్ కంపెనీ కూడా సీఎన్‌జీ ద్విచ‌క్ర‌వాహనాన్ని తీసుకురావాల‌ని చూస్తోంది. TVS CNG 125cc స్కూటర్ ఇటీవలి ఆటోకార్ ఇండియా నివేదిక ప్రకారం.. TVS CNGతో నడిచే జూపిటర్ 125పై పని చేస్తోంది. ఇది ఫ్యాక్టరీలో అమర్చిన CNG కిట్‌తో వచ్చే ప్రపంచంలోనే మొదటి స్కూటర్‌గా అవ‌త‌రించ‌నుంది. TVS కొన్ని సంవత్సరాలుగా వివిధ ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతిక...
Bajaj Freedom CNG Bike | ప్రపంచంలోనే మొట్టమొదటి CNGతో నడిచే బైక్ వ‌చ్చేసింది.. సీఎన్జీతో తిరుగులేని మైలేజీ

Bajaj Freedom CNG Bike | ప్రపంచంలోనే మొట్టమొదటి CNGతో నడిచే బైక్ వ‌చ్చేసింది.. సీఎన్జీతో తిరుగులేని మైలేజీ

Green Mobility
రూ. 95,000 ధ‌ర‌తో ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ ను విడుదల చేసిన బజాజ్ ఆటోBajaj Freedom CNG Bike | ఎన్నో రోజులుగా బైక్ లవర్స్  ఎదురుచూస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి CNG-తో పనిచేసే బైక్‌ వచ్చేసింది. బజాజ్ ఫ్రీడమ్ 125 పేరుతో వ‌చ్చిన ఈ బైక్ పెట్రోల్‌తో పాటు సీఎన్జీతో కూడా పరుగులు పెడుతుంది. కేవలం  అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఒక బటన్ నొక్కడం ద్వారా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) నుంచి పెట్రోల్ కు  మారవచ్చు. CNGతో నడిచే కార్లు దశాబ్ద కాలంగా అందుబాటులో ఉన్నప్పటికీ, భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్నాలజీని  ఉపయోగించిన న‌డిచే మొట్టమొదటి బైక్ ఇదే.. ఈ బైక్ ధర బేస్ 'డ్రమ్' వేరియంట్ కోసం రూ.95,000 నుంచి ప్రారంభమవుతుంది.కొత్త బైక్ కోసం బుకింగ్ విండో ఓపెన్ అయింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ గానీ, అధీకృత షోరూమ్‌ల ద్వారా బుక్ చేసుకోవ‌చ్చు. ఫ్రీడమ్ 125 మూడు వేరియంట్‌లలో విడుదల అయింది.  అవి NG04 డిస్క...
CNG Bike |  పెట్రోల్ బైక్ కి టాటా చెప్పండి.. కొత్తగా బజాజ్ CNG బైక్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే..

CNG Bike | పెట్రోల్ బైక్ కి టాటా చెప్పండి.. కొత్తగా బజాజ్ CNG బైక్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే..

Green Mobility
Bajaj CNG Bike Launch Date | ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవానికి సిద్ధం అవుతోంది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్ ను జూలై 5న లంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.  కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.. అయితే ఈ బైక్ ను జూన్ 18నే విడుదల చేయాలని కంపెనీ భావించింది. కానీ అనివార్య కారణాల వల్ల జూలై 5కు వాయిదా వేసింది.బ్రూజర్ ( Bajaj Bruzer ) అని పిలవబడే ఈ CNG మోటార్‌సైకిల్ 110-150 cc సెగ్మెంట్‌లో ఉంటుందని తెలుస్తోంది. కొన్ని నెలలుగా ఈ వాహనాన్ని పలు ప్రాంతాల్లో పరీక్షలు చేస్తోంది.  CNG పవర్డ్ మోటార్‌సైకిల్ ఇంధన ఖర్చులను 65 శాతం వరకు తగ్గిస్తుందని  తెలుస్తోంది.సీఎన్జీ మోటార్‌సైకిల్‌కి సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికనప్పటికీ , టెస్ట్ మ్యూల్స్ చిత్రాలను బట్టి చూస్తే..  అది మోటార్‌సైకిల్ పొడవున ఉన్న CNG ట్...