
TVS Jupiter CNG : బజాజ్ ఆటో నుంచి బజాజ్ ఫ్రీడమ్ పేరుతో సీఎన్‌జి బైక్ విడుదలైన తర్వాత, ఇప్పుడు టీవీఎస్ కూడాతన మొట్టమొదటి CNG స్కూటర్ విడుదల చేయడానికి సిద్ధమైంది .ఆటో ఎక్స్‌పో 2025లో కంపెనీ తన మొదటి జూపిటర్ సీఎన్‌జీ స్కూటర్ ను ఆవిష్కరించింది.
జూపిటర్ స్కూటర్‌లో CNG ట్యాంక్‌ని వినూత్న రీతిలో అమర్చింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం కొత్త జూపిటర్ CNG ఈ ఏడాదిలోనే విడుదల చేయనన్నట్లు తెలుస్తోంది. కొత్త స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ. 95000 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా టివిఎస్ జూపిటర్ పెట్రోల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 88,174 నుండి రూ. 99,015 వరకు ఉంది.
TVS Jupiter CNG : మైలేజీ
టీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీ వేరియంట్‌లో 1.4 కిలోల బరువున్న సిఎన్‌జి ఫ్యూయల్ ట్యాంక్ ను సీటు కింద ఉన్న బూట్-స్పేస్ ప్రాంతంలో అమర్చారు. కంపెనీ ప్రకారం.. జూపిటర్ సేఫెస్ట్ CNG స్కూటర్. జూపిటర్ సిఎన్‌జి ఒక కిలో సీఎన్‌జీలో 84 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుందని టివిఎస్ కంపెనీ వెల్లడించింది పెట్రోల్ + సీఎన్‌జీపై స్కూటర్ దాదాపు 226 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. 124.8-cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ బై-ఫ్యూయల్ ఇంజిన్ 7.2 హార్స్‌పవర్, 9.4 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 80.5 కి.మీ.
TVS Jupiter CNG : స్పెసిఫికేషన్స్
జూపిటర్ సీఎన్‌జీ స్కూటర్ డిజైన్ విషయానికొస్తే ఇది పెట్రోల్ మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. లాంచ్ సమయంలో మోడల్‌లో కొన్ని అప్‌డేట్‌లు చేయవచ్చని తెలుస్తోంది. కొత్త CNG స్కూటర్‌లో 2-లీటర్ పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే, జూపిటర్ 125 CNGలో LED హెడ్‌లైట్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, ఆల్-ఇన్-వన్ లాక్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉన్నాయి. ఇది అనేక కీ రీడౌట్‌లతో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను పొందుతుంది. ఈ ఇంజిన్ TVS యొక్క పేటెంట్ పొందిన ఎకో-థ్రస్ట్ ఫ్యూయల్-ఇంజెక్షన్, ఇంటెలిగో టెక్నాలజీతో వస్తుంది.
జూపిటర్ 125 CNG లాంచ్ కోసం కంపెనీ ఎటువంటి కాలక్రమాన్ని వెల్లడించలేదు, అయితే, ఈ ఉత్పత్తి 2025 చివరి నాటికి మార్కెట్‌కు సరిపోతుందని వర్గాలు తెలిపాయి. TVS మోటార్ కంపెనీ భారత్ మొబిలిటీ 2025లో ఇథనాల్-శక్తితో పనిచేసే రైడర్ 125, iQube విజన్ కాన్సెప్ట్, అపాచీ RTSX కాన్సెప్ట్‌లను కూడా ప్రదర్శించింది.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..