
Telangana Budget 2025 -26: మహిళలకు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు
Telangana Budget 2025 : తెలంగాణలో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు, నిర్వహణను బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే.. రాష్ట్ర 2025-26 వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క బుధవారం అసెంబ్లీలో ఈ రోజు ఉదయం ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ.. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపన, నిర్వహణను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. సెర్ప్, టీజీఆర్‌ఈడీసీఓ, టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్ మధ్య ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఇందిరా మహిళా శక్తి మిషన్ పథకంSolar Power Plants : వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుతో విద్యుత్ ఉత్పత్తితో పాటు మహిళలకు జీవనోపాధి సైతం లభించనుందని ప్రభుత్వం భావ...