Cheapest Electric Car : భారతీయ రోడ్లపై ఇప్పుడు ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలే కనిపిస్తున్నాయి. రవాణా ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గుచూపుతున్నారు. దేశీయ, విదేశీ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ కార్లనే తయారు చేసే పనిలో పడ్డాయి. తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కార్ల కోసం భారతీయ వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారి కోసమే త్వరలో అతి చౌకైన ఎలక్ట్రిక్ కారు భారత్‌లో రిలీజ్ కానుంది. PMV EaS-E కంపెనీ తయారు చేసిన ఈ కారు ధర రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉంటుందని తెలుస్తోంది. రాబోయే టాటా నానో కంటే తక్కువ ధరకు PMV EaS-E అందించనుంది. టాటా నానో కారు ధర రూ. 5 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. . సామాన్యులకు అందుబాటులో ఉండేలా.. సిటీ ట్రాఫిక్ కష్టాలను తొలగించేలా సింప్లిసిటీకి కోరుకునేవారి కోసం ఈ కారును ప్రత్యేకంగా రూపొందించారు.
PMV EaS-E ఎలక్ట్రిక్ కారు ఫీచర్లు:
ఎలక్ట్రిక్ కారులో ఇందులో రెండు సీట్లు మాత్రమే ఉంటాయి. 2915 మి.మీ. పొడవు ఉండి చూడడానికి చాలా చిన్న సైజులో కనిపిస్తుంది. సిటీ-సెంట్రిక్ EV 13.6PS, 50Nm ఉత్పత్తి చేసే ఒక ఎలక్ట్రిక్ మోటార్ తో ఇది వస్తుంది. ఈ కారు ఛార్జింగ్ కోసం 48 వోల్ట్ బ్యాటరీ వస్తుంది. ఈ కారు మూడు రేంజ్ కాన్ఫిగరేషన్ తో అందుబాటులో ఉంది. వేరియంట్ ను బట్టి ఒకసారి ఛార్జ్ చేస్తే 120 కి.మీ, 160 కి.మీ., 200 కి.మీ. దూరం ప్రయాణించే విధంగా బ్యాటరీ వేరియంట్ ను ఎంపిక చేసుకోవచ్చు. ఇది గరిష్టంగా గంటకు 70 కి.మీ. వేగంతో న్రయాణిస్తుంది.
స్మార్ట్ ఫీచర్లు..
PMV EaS-E కారులో బ్లూటూత్ ఎనేబుల్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, కీలెస్ ఎంట్రీ, ఎల్‌సీడీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, డోర్ లాక్/అన్‌లాక్, విండోస్, ఏసీ కోసం రిమోట్ వెహికల్ ఫంక్షన్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి అలాగే.. ఈ ఎలక్ట్రిక్ కారులో ఆటో లాక్, క్లచ్, గేర్‌బాక్స్ ఉండవు. ఇందులో టచ్‌స్క్రీన్ సౌకర్యం ఉంటుంది. సింపుల్ స్టీరింగ్ నడిపే వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
ఎల్‌ఈడీ లైట్లు, అల్లాయ్ వీల్స్, స్టైలిష్ లుక్ ఈ కారుకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. . భద్రత పరమైన ఫీచర్ల విషయానికొస్తే.. ప్రయాణికులకు సీట్‌బెల్ట్‌లు ఇస్తున్నారు. డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ ఉంటుంది. క్రూయిజ్ కంట్రోల్, పార్కింగ్ అసిస్ట్ కోసం వెనుక కెమెరాను పొందుపరిచారు. ఈ కారులో రిమోట్ పార్కింగ్ ఫీచర్ కూడా ఉంది. అలాగే.. ఇందులో AC, OTAలు కూడా వస్తున్నారు. బ్రేకింగ్ సిస్టమ్ కూడా పటిష్టంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఫుల్ చార్జ్ కావడానికి కేవలం 4 గంటలు పడుతుంది. ఈ కారు బుక్ చేయాలనుకుంటే రూ. 2000 టోకెన్ తో బుకింగ్ చేసుకోవాలి.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..