eBikeGo … లక్ష స్మార్ట్ ఛార్జింగ్ స్టేషన్లు

Spread the love

eBikeGo-Charger

దేశంలోని ప్రముఖ స్మార్ట్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన eBikeGo త్వ‌ర‌లో ల‌క్ష స్మార్ట్ IoT- ఎనేబుల్డ్ ఛార్జింగ్ స్టేషన్లను ఇన్‌స్టాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు పెరుగుతండ‌డంతో దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై అంద‌రూ మొగ్గు చూపుతున్నారు.

ఇటీవ‌ల వీటి అమ్మ‌కాలు విప‌రీతంగా పెరిగాయి. అయితే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఇప్పటికీ స‌ప్రదాయ పెట్రోల్ కంటే ఇంకా తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం స‌రిప‌డా EV చార్జింగ్ స్టేష‌న్ల స‌దుపాయం లేదు. దీంతో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను కొనుగోలు చేయడానికి వినియోగ‌దారులు ఆలోచిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో భారతదేశంలో EV వ్యవస్థను అభివృద్ధి చేయడానికి eBikeGo సంస్థ దేశంలోని ఏడు నగరాల్లో ఒక లక్ష స్మార్ట్ IoT- ఎనేబుల్డ్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించ‌డం హ‌ర్షించ‌ద‌గిన విష‌యం.

eBikeGo భారతదేశంలో అతిపెద్ద స్మార్ట్ ఎలక్ట్రిక్ టూవీలర్ మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిజ‌ ఇది పర్యావరణ అనుకూలయ‌మైన ర‌వాణా ఫెసిలిటీస్‌ను అందిస్తుంది. ఇప్పుడు కంపెనీ IoT- ఎనేబుల్డ్ స్మార్ట్ ఛార్జింగ్ సొల్యూషన్ ఛార్జ్‌ను రూపొందించింది. ఇబైక్‌గో ఛార్జ్ అనేది ఒక రకమైన ఛార్జింగ్ స్టేషన్. ఇది ప్రధాన నగరాల్లో ప్రతి 500 మీటర్లకు ఇన్‌స్టాల్ చేయబడుతుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత ఈ ఛార్జర్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఇది యూజర్ డిమాండ్ ప్రకారం ముందుగా నిర్ణయించిన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ పేమెంట్ మెకానిజం కూడా ఉంది.

ఇబైక్‌గో ఛార్జ్ మొబైల్ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఇండోర్, పూణే, న్యూఢిల్లీ, అమృత్‌స‌ర్ నగరాల్లో ఒక లక్ష ఇబైక్‌గో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. EBikeGo ఛార్జ్ 3-పిన్ పవర్ కనెక్టర్‌తో వస్తుంది. 16V/3.3kW తో 50Hz AC అవుట్‌పుట్‌తో 190V-240V పవర్ రేంజ్ ఉంటుంది. ఈ పోర్టబుల్ ఛార్జింగ్ స్టేషన్ మెషిన్ లెర్నింగ్, AI టెక్నాల‌జీతో న‌డుస్తుంది.

eBikeGo ఛార్జర్

ఇబైక్‌గో వ్యవస్థాపకుడు & CEO అయిన ఇర్ఫాన్ ఖాన్ మాట్లాడుతూ.. “ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ ఉన్న అన్ని ప్రధాన నగరాల్లో త‌మ స్మార్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తుండ‌డం సంతోషంగా ఉంద‌ని తెలిపారు. ఇవి ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌ను పెంచడానికి. అలాగే దేశంలోని EV వ్యవస్థను అభివృద్ధి చేయడంలో సహాయపడటమే కాకుండా, కాలుష్యం త‌గ్గింపున‌కు దోహ‌ద‌ప‌డుతుంద‌ని తెలిపారు. మ‌రోవైపు బ్యాటరీ మార్పిడి సిస్టమ్ సమస్యలను కూడా త‌గ్గిస్తుంద‌ని చెప్పారు. ఒక సంవత్సరంలో ఇబైక్‌గో కనీసం ఒక లక్ష ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ఛార్జింగ్ స్టేషన్లు AI, IoT- ఎనేబుల్ చేయబడ్డాయి. వాటిని eBikeGo యాప్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు అని తెలిపారు.

4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..