దీపావళికి పర్యావరణ రక్షణ కోసం మీ వంతుగా  ఇలా చేయండి.. ­Eco Friendly Diwali 2025
1 min read

దీపావళికి పర్యావరణ రక్షణ కోసం మీ వంతుగా ఇలా చేయండి.. ­Eco Friendly Diwali 2025

Spread the love

­Eco Friendly Diwali 2025 : దీపావళి పర్వదినాన్ని పర్యావరణ హితంగా జరుపుకోవడానికి ఎన్నో అవకాశాలున్నాయి. చిన్నచిన్న మార్పులను తీసుకొస్తే చాలు.. వీటిని అనుసరించి మీరు కూడా పర్యావరణానికి సాయం చేయండి. అవేంటో తెలుసుకోండి.

­Eco Friendly Diwali 2025: వెలుగుల పండుగ దీపావళి (Diwali ) మన అందరి జీవితాల్లో చీకట్లను పారదోలడానికి వచ్చేస్తోంది. దీపావళి అంటేనే పిల్లలు, యువత, బాణసంచా కాల్చడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ టపాసుల కారణంగా పర్యావరణానికి హాని కలుగుతుంది. పర్యావరణవేత్తలు కూడా ఇదే విషయమై తరచూ హెచ్చరిస్తుంటారు. దీపావళి పండుగ దీపాలు, బాణసంచాతో ముడిపడి ఉంటుంది. ఇవి వాయు, శబ్ద కాలుష్యానికి కారణమవుతుంది. గాలి కాలుష్యంతో ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ (COPD), ఇతర శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. అయితే మీరూ ప్రకృతికి, పర్యావరణానికి మేలు చేసేలా దీపావళి జరుపుకోవాలని ఆలోచిస్తున్నారా? ఎకో ఫ్రెండ్లీ దీపావళిని జరుపుకోవడానికి మీరు పాటించగలిగే చక్కని మార్గాలు ఉన్నాయి.

Diwali 2025 మట్టి దీపాలు వెలిగించండి..

ప్రతీ దీపావళికి మట్టి దీపాలను వాడుకునే అలవాటు మనందరికీ ఉంది. ఇంటి ముంగిళ్లు, ప్రహరీలపై దీపాలను వెలిగించి అలంకరిస్తుంటారు. అయితే ఇప్పుడు రకరకాల పదార్థాలతో తయారయ్యే లైట్లు ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి. ప్లాస్టిక్ తో తయారయ్యే ప్రమిదల్లాంటి విద్యుత్‌ దీపాలను అలంకరణలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే నూనెతో వెలిగించిన మట్టి దీపాల వల్ల వాతావరణం శుద్ధి అవుతుంది. అదే విద్యుత్ ని ఎక్కువగా వాడటం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుంది. సంప్రదాయ మట్టి దీపాల్ని చక్కగా అంతా వెలిగించుకోండి.

Eco Friendly గ్రీన్‌ క్రాకర్లు :

దీపావళిని గ్రీన్‌ క్రాకర్ల లేదా ఎకో ఫ్రెండ్లీ ఫైర్ వర్క్స్ తో మాత్రమే జరుపుకోండి. ఇవి మిగిలిన వాటితో పోలిస్తే వాతావరణంలోకి తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయి. శబ్దం కూడా చాలా తక్కువగా వస్తాయి. అందువల్ల గాలి కాలుష్యంతోపాటుగా శబ్ద కాలుష్యం రెండూ తగ్గుతాయి.

ఎల్ఈడీ లైట్లు :

ఇంటిని చాలా మంది సీరియల్‌ లైట్లతో అలంకరించుకుంటూ ఉంటారు. అలా లైట్లు వెలుగుతూ ఆరుతూ ఉంటే వాటి చూస్తూ ఎంతో మురిసిపోతుంటారు. అలాంటి వారు ఎకో ఫ్రెండ్లీగా ఉండేందుకు మామూలు లైట్లకు బదులుగా ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసుకోండి. అవి మిగిలిన వాటితో పోలిస్తే తక్కువ విద్యుత్ ను ఖర్చు చేస్తాయి..

సహజమైన రంగులతో ముగ్గులు :

దీపావళి పర్వదినం సందర్భంగా ఇంటి ముంగిళ్లలో పెద్ద పెద్ద ముగ్గులను వేస్తారు. వాటిపైన సింథటిక్‌ రంగుల్ని చల్లకండి.. రసాయనాలు ‌ లేని సహజమైన సుద్ద తో చేసే రంగులను ఉపయోగించండి. లేదంటే పూలతో రంగోలీల ను అలంకరించండి.

రీయూజ్, రీసైకిల్

మీరు గతేడాది ఉపయోగించిన అలంకరణ వస్తువులు మీ వద్ద ఉంటే.. కొత్త వాటిని కొనుగోలు చేయడానికి బదులుగా వాటినే ఉపయోగించండి. ఈ సంవత్సరం వన్-టైమ్ డెకరేషన్ లలో పెట్టుబడి పెట్టండి. ప్రతీ ఏటా ఉపయోగించుకోగలిగే వస్తువును కొనుగోలు చేయండి. ఈ విధంగా మీరు పర్యావరణాన్ని డబ్బును కూడా ఆదా చేస్తారు.

Diwali 2025 : పర్యావరణ హితమైన బహుమతులు

పర్యావరణ సహితంగా ఈ దీపావళికి (Green Diwali) ముస్తాబు కావాలనుకునేవారు కాటన్‌, ఖాదీ వస్త్రాల్ని ధరించండి. అలాగే మొక్కలు, మట్టి పాత్రలు, ఆర్గానిక్‌ ఉత్పత్తులను మీకు నచ్చినవారికి బహుమతులుగా అందించండి. అలాగే బహుమతుల్ని ఇచ్చేప్పుడు పైన గిఫ్ట్‌ రేపర్ తో ప్యాకింగ్‌ చేస్తారు. దాన్ని కూడా ప్లాస్టిక్ కవర్‌ వంటి మెటీరియల్ తో కాకుండా కాగితం లేదా జూట్ వాటితో ప్యాక్ చేయండి.. కేవలం దీపావళి రోజునే కాకుండా వీటిని ఎప్పటికీ ప్లాస్టిక్ కవర్లను తక్కువగా వాడాలని బలంగా నిర్ణయించుకోండి. మీ ఎకో ఫ్రెండ్లీ జీవనం.. ఒక్క దీపావళి రోజునే ఉండొద్దు.. ప్రతీ రోజును ఇలాగే గడిపేందుకు యత్నించాలి. అప్పుడే పర్యావరణాన్ని కాపాడుకోవడంలో మనం మన వంతు పాత్ర పోషించినవాళ్లమవుతాం..


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  X , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *