Green Crackers

Green Crackers | ఢిల్లీలో గ్రీన్ బాణసంచాకు అనుమతి — గ్రీన్ క్రాకర్స్ తో పండుగ ఉత్సాహం

Spread the love

Diwali 2025 | దీపావళికి ముందే గ్రీన్‌ బాణసంచా (Green Crackers) పై నిషేధాన్ని సుప్రీంకోర్టు సడలించింది, ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప‌రిధిలో నిర్ణీత ప్రదేశాలు, సమయాల్లో గ్రీన్ క్రాక‌ర్స్‌ అమ్మకాలు, వినియోగానికి అనుమతిచ్చింది. “పర్యావరణ ఆందోళనలు, పండుగ సీజన్ మనోభావాలు, టపాసుల తయారీదారుల జీవనోపాధి హక్కు”ను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సుప్రీం కోర్టు తెలిపింది.
వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి రూపొందించబడిన గ్రీన్ క్రాకర్లు సాంప్రదాయ పటాకుల కంటే తక్కువ-ఉద్గారాల‌ను వెలువ‌రిస్తాయి. శబ్ద తీవ్రత, ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో సాంప్రదాయ క్రాకర్లలోని కొన్ని ప్రమాదకర ఏజెంట్లను తక్కువ కాలుష్య కారకాలతో భర్తీ చేస్తాయి.

30% తక్కువ కాలుష్యం

బేరియం నైట్రేట్ వంటి హానికరమైన రసాయనాలు లేని కారణంగా గ్రీన్ క్రాకర్లు దాదాపు 30% తక్కువ కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తాయని చెబుతారు. గాలిని అంతగా కలుషితం చేయని సురక్షితమైన పదార్థాలను ఈ ర‌క‌మైన బాణ‌సంచా త‌యారీలో ఉపయోగిస్తారు. ఈ పర్యావరణ అనుకూల బాణసంచా మూడు ప్రధాన రకాలుగా వస్తాయి:

  • SWAS (Safe Water Releaser): నీటి ఆవిరి విడుదల చేసి కాలుష్యాన్ని తగ్గిస్తుంది.
  • STAR (Safe Thermite Cracker): తక్కువ శబ్దం మరియు పొగ ఉత్పత్తి చేస్తుంది.
  • SAFAL (Safe Minimal Aluminium): తక్కువ హానికర లోహాలను ఉపయోగిస్తుంది.

గ్రీన్ క్రాకర్స్ కాలుష్యాన్ని దాదాపు 30–35 శాతం తగ్గించగలవు, కానీ వీటిని సైతం పెద్ద ఎత్తున ఉపయోగించడం వల్ల ఈ ప్రయోజనాలను కోల్పోవచ్చు, ముఖ్యంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో పంటలను కాల్చడం వల్ల కలిగే కాలుష్యం కారణంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతం ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేప‌థ్యంలో ప‌రిమితికి మించి బాణ సంచా కాల్చ‌డం వ‌ల్ల కాలుష్యం పెర‌గ‌వ‌చ్చు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏమిటి?

సుప్రీంకోర్టు కొత్త ఆదేశాల ప్రకారం, నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NEERI) ఆమోదించిన గ్రీన్ క్రాకర్లను మాత్రమే అమ్మకానికి, కాల్చ‌డానికి అనుమతిస్తారు. వీటిని ఢిల్లీ-NCR అంతటా నియమించబడిన ప్రదేశాలలో, అక్టోబర్ 18-21 వరకు ఉదయం 6-7 గంటల నుంచి రాత్రి 8-10 గంటల మధ్య మాత్రమే ఉపయోగించవచ్చు, అంటే నివాసితులు 4 రోజుల పాటు క్రాకర్లను కాల్చవచ్చు.
క్రాకర్ తయారీదారులపై పెట్రోలింగ్‌ బృందాలు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని. వారి QR కోడ్‌లను సైట్‌లలో అప్‌లోడ్ చేయాలని SC ఆదేశించింది.
భద్రత, పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా లైసెన్స్ పొందిన విక్రేతల నుండి మాత్రమే గ్రీన్ క్రాకర్లను కొనుగోలు చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఈ బాణసంచా సాంప్రదాయ బాణసంచా కంటే తక్కువ కాలుష్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, అవి కొన్ని హానికరమైన ఉద్గారాలను విడుదల చేస్తాయి, కాబట్టి వాటిని బాధ్యతాయుతంగా ఉపయోగించడం ముఖ్యం.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  X , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

More From Author

Tata Punch EV

దీపావళి ధమాకా: టాటా ఎల‌క్ట్రిక్ కార్ల‌పై భారీ ఆఫర్లు! Tata EV

Eco Friendly Diwali

దీపావళికి పర్యావరణ రక్షణ కోసం మీ వంతుగా ఇలా చేయండి.. ­Eco Friendly Diwali 2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest

Indie Electric Scooter : భార‌తీయ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌కు అంతర్జాతీయ గౌరవం

రివర్ మొబిలిటీ ‘ఇండీ’ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు రెడ్ డాట్ డిజైన్ అవార్డు 2025 Indie Electric Scooter : రివర్ మొబిలిటీ తన ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం రెడ్ డాట్ ప్రొడక్ట్ డిజైన్ అవార్డు 2025ను అందుకుంది, 2024లో రెడ్ డాట్ డిజైన్ కాన్సెప్ట్ అవార్డుకు సైతం రివర్​ మొబిలిటీ కైవసం చేసుకుంది. ఈ...