Eco friendly Ganesha | మట్టి గణపతులను పూజిద్దాం.. ప్రకృతికి చేయూతనిద్దాం..

Eco friendly Ganesha
Spread the love

Eco friendly Ganesha | దేశమంతా వినాయక చవిత ఉత్సవాలకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. హిందూ పండగలు సంస్కృతి సంప్ర‌దాయాల‌ను ముందుత‌రాల‌కు అందించ‌డంతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ప్రతీ పండగ వెనక ఎంతో గొప్ప చ‌రిత్ర ఉంటుంది. మ‌న పండుగ‌లు ప్రకృతిలో మమేకమవుతూ నేలా-నీరు, చెట్టూ చేమ స‌మ‌స్త జీవ‌రాశుల‌ను ఆరాధించడం గుర్తించ‌వ‌చ్చు. ఇది మన సంస్కృతిలో భాగంగా అనాదిగా కొనసాగుతూ వస్తోంది. అయ‌తే ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు వ‌చ్చాయి. కాలుష్యానికి కారణమయ్యే ప్లాస్ట‌ర్ ఆఫ్ ప్యారిస్, ర‌సాయ‌న రంగుల‌తో ఆక‌ర్ష‌నీయంగా క‌నిపించేలా త‌యారు చేసే విగ్ర‌హాల‌ను పూజించ‌డం మానేద్దాం.. ఇలాంటి విగ్ర‌హాల వ‌ల్ల ప‌ర్యావర‌ణానికి ఎంతో హాని క‌లుగుతుంది అందుకే పర్యావరణ హిత గణపతి ప్ర‌తిమ‌ల‌నే పూజిద్దాం..

వివిధ రకాల హానిక‌ర ర‌సాయ‌నాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసే విగ్రహాల వల్ల తీవ్రమైన నీటి కాలుష్యం ఏటా పెరుగుతోంది. మన భక్తి వల్ల మరొకరికి ముప్పు వాటిల్లడం స‌రికాదు.. గొప్ప‌మ‌న‌సుతో ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు.. మట్టి గణపతి (Eco friendly Ganesha Idols) కోసం దృఢ‌ సంకల్పం తీసుకోవచ్చు. ఒక‌రిని చూసి మ‌రొక‌రు గొప్పలకు పోయి భారీ విగ్ర‌హాలను ప్ర‌తిష్టిస్తూ మనకు మనమే నష్టం చేసుకోవ‌ద్దు. త‌క్కువ ఖ‌ర్చుతో త‌క్కువ ప‌రిమాణంలో ఉన్న విగ్ర‌హాల‌ను పూజిస్తూ పండగ చేసుకొని పది మందికి మంచిని పంచండి.

మండ‌పాల‌ ఏర్పాటు

మట్టి గణపతులను పూజించడంతోనే స‌రిపెట్టుకోకుండా వినాయ‌క మండ‌పాల‌ను ఏర్పాటు చేయ‌డంలోనూ ఉదారంగా వ్య‌వ‌హ‌రించాలి. రోడ్లన్నీ మూసుకుపోయేలా అడ్డదిడ్డంగా మండపాలు నిర్మించ‌వ‌ద్దు. ట్రాఫిక్ కు ఇబ్బందులు క‌లిగించ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. వీధికో వినాయ‌కుడిని ప్ర‌తిష్టించ‌కుండా కాల‌నీవాసులంతా క‌లిసి ఐక‌మ‌త్యంతో ఒకే గణపతిని పెట్టుకుంటే.. దేవుడు కూడా దీవిస్తాడు. ఊరు వాళ్లంతా కలిసి ఒక్కటే విగ్రహాన్ని పూజిస్తే ఊరంతా ఒక్క‌ట‌వుతుంది. అలాగే ప్ర‌తిరోజు భ‌క్తిపాట‌ల పేరుతో భారీ శ‌బ్దాల‌తో డీజే సౌండ్లు చేయ‌కుండా సంయ‌మ‌నం పాటించండి.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *