తిరుమలలో భక్తుల కోసం ఎలక్ట్రిక్ బస్సులు

Spread the love

Electric Buses in Tirumala: ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల దేవస్థానానికి కొత్తగా ఎలక్ట్రిక్ ధర్మరథాలు వచ్చేశాయి. తిరుమలలో ఈ బస్సులు భక్తులు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తాయి. మొత్తం 10 బస్సులను మేఘా ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ సంస్థ విరాళంగా ఇచ్చింది.

Electric Buses in Tirumala: తిరుమలలో భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు 10 Electric buses (ఎలక్ట్రిక్ బస్సులు) సిద్ధమయ్యాయి. ఈ విద్యుత్ ధర్మరథాలను తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam – TTD) చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి (YV Subba Reddy) మార్చి 27న ప్రారంభించారు. చైర్మన్‍తో పాటు టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం ఈ ధర్మరథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పచ్చజెండా ఊపి ఈ బస్సులను ప్రారంభించారు. ఈ విద్యుత్‌ ధర్మరథాల్లో ప్రయాణించి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. రూ.84 కోట్ల విలువైన ఈ 10 ఒలెక్ట్రా కంపెనీ ఎలక్ట్రిక్ బస్సులను (Olectra Electric Buses) మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్ (Meil).. టీటీడీకి విరాళంగా అందించింది.

దశల వారీగా ఎలక్ట్రిక్ దిశగా..

Electric Buses in Tirumala: వాతావరణ కాలుష్యాన్ని నిరోధించేందుకు తిరుమలలో డీజిల్ వాహనాల స్థానంలో విద్యుత్ వాహనాలను దశల వారీగా తీసుకురావాలని నిర్ణయించుకున్నట్టు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి అన్నారు. ఇందులో భాగంగా అధికారులకు ఇప్పటికే 35 ఎలక్ట్రిక్ కార్లు ఇచ్చామని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) కూడా తిరుపతి నుంచి తిరుమలకు 65 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోందని ఆయన మీడియాతో చెప్పారు. మేఘా ఇంజనీరింగ్‌ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (Megha Engineering & Infrastructures Ltd – Meil) సంస్థ ఒక్కో బస్సును రూ.1.80 కోట్ల ఖర్చుతో తయారు చేయించి 10 బస్సులను టీటీడీకి విరాళం ఇచ్చిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ఏప్రిల్ 15 నుంచి పరుగులు..

Electric Buses in Tirumala: ఈ విద్యుత్ బస్సులను నడిపేందుకు టీటీడీ డ్రైవర్లకు ఒలెక్ట్రా సంస్థ శిక్షణ ఇస్తుందని సుబ్బారెడ్డి వెల్లడించారు. ఏప్రిల్‌ 15 నుంచి తిరుమలలో భక్తులకు ఉచిత ప్రయాణం కోసం ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. మేఘా సంస్థకు చెందినదే ఒలెక్ట్రా గ్రీన్‍టెక్ కంపెనీ.

ఈ ఎలక్ట్రిక్ ధర్మరథాల ప్రారంభ కార్యక్రమంలో ఒలెక్ట్రా సంస్థ సీఎండీ కేవీ ప్రదీప్‌, టీటీడీ చీఫ్‌ ఇంజినీర్‌ నాగేశ్వరరావు సహా పలువురు టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

తిరుమలలో స్వామి వారిని దర్శించే భక్తుల కోసం కాలుష్య రహిత ప్రయాణం అందించేందుకు ఒలెక్ట్రా సంస్థ ఈ బస్సులను రూపొందించింది.
9 మీటర్ల పొడవుండే ఈ బస్సులో 23 మంది సీట్లలో కూర్చొని ప్రయాణించవచ్చు. అదనంగా కొంత స్టాండింగ్ ఏరియా కూడా ఇచ్చారు.
భక్తులకు పూర్తి భద్రతతో కూడిన ప్రయాణ సౌకర్యం కల్పించేలా బస్సును తయారు చేసినట్లు ఒలెక్ట్రా సంస్థ ప్రతినిధులు తెలిపారు.
భక్తులు శబ్ద, వాయు కాలుష్యంలేని ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.
బస్సుల్లో ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డ్‌లు ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తోందో తెలిపే వివరాలు ఈ డిస్‌ప్లే బోర్డుపై కనిపిస్తాయి.
తిరుమల పవిత్రత, ప్రాశస్త్యాన్ని తెలిపే ఫోటోలను బస్సుపై పొందుపరిచారు.
ఈ బస్సుల ఛార్జింగ్ కోసం టీటీడీ సూచించిన ప్రదేశంలో ప్రత్యేక ఛార్జింగ్ పాయింట్‌‌ను కూడా ఒలెక్ట్రా సంస్థ ఉచితంగా నిర్మించి ఇవ్వనుంది.
ఈ ఎలక్ట్రిక్ బస్సుల సేవలు ప్రారంభమైతే టీటీడీకి డీజిల్ ఖర్చుల భారం తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యం  తగ్గానుంది.

More From Author

BPCL EV charging stations

రూ.800కోట్ల‌తో 7000 BPCL EV charging stations

Rs.49,499కే లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest

Bajaj Chetak : త్వరలో నెక్స్ట్‌-జెన్ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ !

కొత్త డిజైన్‌, అధునాతన ఫీచర్లతో 2026లో మార్కెట్లోకి Chetak 2026 Launch : ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో బజాజ్ ఆటో మరోసారి సంచలనానికి సిద్ధమవుతోంది . చేతక్‌ 35 సిరీస్‌, 30 సిరీస్‌ల గ్రాండ్ స‌క్సెస్ త‌ర్వాత కంపెనీ ఇప్పుడు నెక్స్ట్‌-జెనరేషన్ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇటీవల స్పై ఫొటోలు సోష‌ల్‌మీడియాలో...