Harithamithra Telugu News

Home EV Updates ఓలా ఎలక్ట్రిక్ ధమాకా ఆఫర్: పాత స్కూటర్ ఇస్తే కొత్తదానిపై రూ. 50,000 డిస్కౌంట్.. ‘Ola...

ఓలా ఎలక్ట్రిక్ ధమాకా ఆఫర్: పాత స్కూటర్ ఇస్తే కొత్తదానిపై రూ. 50,000 డిస్కౌంట్.. ‘Ola Insiders’ షురూ!

0
Ola Electric

Harithamithra : భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ (Ola Electric) తన 10 లక్షల మందికి పైగా ఉన్న కస్టమర్ల కోసం సరికొత్త ‘ఓలా ఇన్‌సైడర్స్’ (Ola Insiders) కమ్యూనిటీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా పాత కస్టమర్లు తమ వాహనాలను అప్‌గ్రేడ్ చేసుకోవడమే కాకుండా, కొత్త కొనుగోళ్లు, రిఫరల్స్ ద్వారా భారీ ప్రయోజనాలను పొందవచ్చు.

Ola Insiders : అప్‌గ్రేడ్ చేసుకుంటే రూ. 50,000 లాభం!

ఓలా Gen 1 Ola Gen 2 స్కూటర్లను వాడుతున్న కస్టమర్లు ఇప్పుడు లేటెస్ట్ Gen 3 S1 పోర్ట్‌ఫోలియో లేదా రోడ్‌స్టర్ (Roadster) మోటార్‌సైకిళ్లకు అప్‌గ్రేడ్ కావచ్చు. ఇలా అప్‌గ్రేడ్ చేసుకునే వారికి ఏకంగా ₹50,000 వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. ఇందులో అత్యాధునిక ‘4680 భారత్ సెల్’ టెక్నాలజీతో పనిచేసే మోడళ్లను పొందే అవకాశం కూడా ఉంది.

రెండో వాహనంపై రూ. 20,000 రాయితీ

ఇప్పటికే ఓలా వాహనం ఉన్న కస్టమర్లు అదే పేరుతో మరో ఓలా వాహనాన్ని కొనుగోలు చేస్తే ₹20,000 వరకు అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, సాఫ్ట్‌వేర్ (MoveOS) అప్‌గ్రేడ్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

రిఫర్ చేయండి.. నగదు గెలవండి! మీ స్నేహితులకు లేదా బంధువులకు ఓలా వాహనాన్ని రిఫర్ చేస్తే, ఆ వాహనం డెలివరీ అయిన తర్వాత మీకు ₹5,000 వరకు ఓలా క్రెడిట్స్ లభిస్తాయి. అలాగే కొత్తగా కొనుగోలు చేసిన వారికి ₹1,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

ఓలా ప్రస్తుత పోర్ట్‌ఫోలియో ధరలు:

  • Gen 3 S1 లైనప్: ఇందులో S1 Pro+, S1 Pro మోడళ్లు ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి వీటి ధరలు ₹1,24,999 నుండి ₹1,90,338 వరకు ఉన్నాయి.
  • మాస్-మార్కెట్ రేంజ్: S1 X+ మరియు S1 X మోడళ్లు ₹82,999 నుండి ₹1,19,999 మధ్య లభిస్తున్నాయి.
  • రోడ్‌స్టర్ మోటార్‌సైకిళ్లు:
  • Roadster X+: ధర ₹1,29,999 నుండి ₹1,89,999 (9.1kWh వేరియంట్ వరకు).
  • Roadster X: ధర ₹99,999 నుండి ₹1,24,999 వరకు ఉంది.

తమిళనాడులోని తన సొంత ప్లాంట్ నుండి వాహనాలను తయారు చేస్తున్న ఓలా, డైరెక్ట్-టు-కస్టమర్ మోడల్ ద్వారా దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. అప్‌గ్రేడ్ కావాలనుకునే వారికి ఇది సువర్ణావకాశం.

Previous articleGreaves Electric Mobility sales | ఈవీ మార్కెట్‌లో సంచలనం: ఓలాను దాటేసిన ఆంపియర్.. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ సరికొత్త రికార్డు!
Next articleTVS iQube Sales | ఈవీ మార్కెట్‌లో టీవీఎస్ ‘ఐక్యూబ్’ ప్రభంజనం: 28% వాటాతో నంబర్ 1..
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here