Sunday, December 8Lend a hand to save the Planet
Shadow

Electric car offers | ఎలక్ట్రిక్ కార్లపై ఇయర్‌ ఎండ్‌ డిస్కౌంట్స్‌.. రూ.లక్షల్లో తగ్గింపు..

Spread the love

Electric car offers | కొత్త కార్లు కొనాలనుకునేవారికి శుభవార్త.. కార్లు కొనుగోలు చేసేటపుడు మైలేజ్‌, ధర సమస్యతో చాలా మంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ ఇబ్బందులకు చెక్‌ పెడుతూ ఇటీవల ప్రముఖ కంపెనీలన్నీ అదిరిపోయే మైలేజ్‌ ఆప్షన్‌తో పాటు అత్యాధునిక ఫీచర్లతో ఈవీలను రిలీజ్‌ చేశాయి. అయితే ప్రస్తుతం మనం 2023 చివర్లో ఉన్నాము. ఈ క్రమంలో.. అన్ని కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లపై ఇయర్‌ ఎండ్‌ డిస్కౌంట్స్‌ ప్రకటిస్తున్నాయి. ఈవీలపై కూడా ఈ డిస్కౌంట్స్‌ అందుబాటులో ఉన్నాయి..

భారతదేశంలో ఈవీ వాహనాలు కొనుగోళ్ల జోరు ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఈవీల అమ్మకాలు పెరిగాయి. అయితే ఈ అమ్మకాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లే అధికంగా ఉంటున్నాయి. కానీ కార్ల విషయానికి వచ్చేసరికి రేంజ్ సమస్యతో చాలా మంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలుకు వెనుకాడుతున్నారు.. ఈ సమస్యకు చెక్‌ పెడుతూ ఇటీవల టాప్‌ కంపెనీలన్నీ అదిరిపోయే రేంజ్ ఆప్షన్‌తో పాటు అధునాతన ఫీచర్లతో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేశాయి.

కొన్ని కంపెనీలు.. ఇయర్‌ ఎండ్‌ డిస్కౌంట్స్‌ ప్రకటిస్తున్నాయి..  మీరు కూడా కొత్త కారు కొనాలనే ఆలోచనతో  ఉంటే ఇదే సరైన సందర్భం. కాబట్టి ఇయర్‌ ఎండ్‌ డిస్కౌంట్స్‌ అందుబాటులో ఉన్న కార్ల గురించి ఓసారి తెలుసుకుందాం.

మహీంద్రా & మహీంద్రాకు సంబంధించిన ఎక్స్‌యూవీ 400పై రూ.4.2 లక్షల తగ్గింపు ఆఫర్‌ చేస్తుంది..

అలాగే ఎంజీకు చెందిన జెడ్‌ఎస్‌ ఈవీపై రూ.50,000 వరకు నగదు తగ్గింపుతో అందుబాటులో ఉంది. దీంతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 50,000 కార్పొరేట్, లాయల్టీ బోనస్‌లతో కలిపి రూ.2.2 లక్షలు తగ్గింపుతో ఎంజీ జెడ్‌ఎస్‌ను పొందవచ్చు.

భారతదేశంలో ఎంట్రీ లెవల్ ev  అయిన ఎంజీ కామెట్‌పై ఇయర్‌ ఎండ్‌ డిస్కౌంట్స్‌ను పొందవచ్చు. ఈ నెలలో రూ.20 వేల లాయల్టీ బోనస్‌తో పాటు కార్పొరేట్ తగ్గింపు, రూ.5,000 బీమాను పొందవచ్చు.

ఇక టాటా టిగోర్‌ కూడా ఎంపిక చేసిన ఈవీ ట్రిమ్‌లపై డీలర్-ఎండ్ డిస్కౌంట్‌ల హోస్ట్‌తో అందిస్తున్నారు. అయితే ఈ తగ్గింపులు స్టాక్ లభ్యత, స్థానం ఆధారంగా ఉంటుంది. టాటా మోటార్స్ ఇటీవలే ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్ ఈవీని పరిచయం చేసింది. ఈ నెలలో ఇది గణనీయమైన తగ్గింపులను పొందలేదు. అయితే ప్రీ-ఫేస్‌లిఫ్టెడ్ మోడల్‌కు సంబంధించిన ఇన్వెంటరీని కనుగొంటే మాత్రం డీలర్‌లతో మంచి ఆఫర్‌లను చర్చించవచ్చు.

Electric car offers టాటీ టియాగో ఈవీపై ఎలాంటి ఆఫర్‌లు లేనప్పటికీ కియా ఈవీ6 ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ క్రాసోవర్‌పై మాత్రం మంచి డీలర్-స్థాయి ప్రయోజనాలతో పొందవచ్చు. హ్యుందాయ్ ఐయోనిక్‌ 5 డిసెంబర్ 2023లో ఎటువంటి ముఖ్యమైన ఆఫర్లు పొందలేదు. అయితే డిస్కౌంట్ డీల్‌లు స్టాక్, డీలర్ మరియు లొకేషన్ లభ్యతకు లోబడి ఉంటాయి.

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్,  ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *