Electric cycle offer

Electric cycle offer | ఈ ఎలక్ట్రిక్ సైకిల్ పై రూ.3000 డిస్కౌంట్..

Spread the love

Electric cycle offer | అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని Nexzu Mobility కంపెనీ మహిళా కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది.  ఈ ఆఫర్  మార్చి 8 నుండి మార్చి 17 వరకు (10 రోజులు) కొనసాగుతుంది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు Rompus Plus, Bazinga EV సైకిళ్లపై   మూడు వేల తగ్గింపు  పొందవచ్చు.

గతంలో రూ.32,750గా ఉన్న రోంపస్ ప్లస్ ఇప్పుడు రూ.29,750 తగ్గింపు ధరతో అందుబాటులోకి వచ్చింది. రోంపస్ ప్లస్ రోజువారీ ప్రయాణాల కోసం రూపొందించబడింది. 5.2Ah Li-ion బ్యాటరీని కలిగి ఉన్న ఈ ఎలక్ట్రిక్ సైకిల్ సింగిల్ ఛార్జింగ్ పై 32 కిమీ రేంజ్ ఇస్తుంది.  ఇది గంటకు  25 కిమీ/గం గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.

ఇక మరో మోడల్ Nexzu Bazinga EV సైకిల్ మునుపటి ధర రూ. 44,500 గా ఉండగా, ఇప్పుడు ప్రత్యేక ఆఫర్ కింద రూ. 41,500 కి అందుబాటులో ఉంది.  Bazinga లోల్ డిటాచబుల్ Li-ion బ్యాటరీపై సింగిల్ చార్జిపై 100km వరకు ప్రయాణించవ్చు.

Electric cycle offer పై Nexzu మొబిలిటీ బిజినెస్ హెడ్ చింతామణి సర్దేశాయ్ మాట్లాడుతూ, ” మహిళలకు సాధికారత కల్పించడం వల్ల  సమాజం ఉన్నత మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ ప్రత్యేక మహిళా దినోత్సవ ఆఫర్‌తో, పర్యావరణ అనుకూల రవాణా ఎంపికలను  ఎంచుకోవడానికి వీలుంటుందని తెలిపారు. మా కంపెనీ నుంచి సరికొత్త ఆఫర్లతో  మహిళలను ప్రోత్సహించాలని మేము భావిస్తున్నామన్నారు.  వినియోగదారులు ఈ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా Nexzu డీలర్ భాగస్వాముల నుంచి లేదా “EVQUEEN2024” కూపన్ కోడ్‌ని ఉపయోగించి కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

More From Author

Help Birds in Summer Save the birds

Help Birds in Summer | ఈ వేసవిలో పక్షులకు మీ స‌హాయం కావాలి.. మీరు సులువుగా చేయగలిగేవి ఇవీ..

Ather Rizta Sooter

Ather Rizta Sooter | ఏప్రిల్ లాంచ్‌కు ముందు కొత్త ఫీచర్లను వెల్ల‌డించిన ఏథ‌ర్‌..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *