Ev sales 162% పెరిగాయ్..
భారతదేశంలో ఈ ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో మొత్తం 162 శాతం వృద్ధిని నమోదు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో గురువారం తెలిపారు.
ప్రశ్నోత్తరాల సమయంలో గడ్కరీ ఒక ప్రశ్నకు బదులిస్తూ.. ఏడాది ప్రాతిపదికన, అమ్మకాలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. కేటగిరీల వారీగా electric ద్విచక్ర వాహనాలు 423 శాతం, మూడు చక్రాల వాహనాలు 75 శాతం, నాలుగు చక్రాల వాహనాలు 238 శాతం, బస్సుల విక్రయాలు 1,250 శాతం చొప్పున ఐదు రెట్లకు పైగా పెరిగాయని ఆయన వెల్లడించారు.
ఈ ఏడాది మార్చి 13 నాటికి భారతదేశంలో మొత్తం 10,95,746 Ev sales (ఎలక్ట్రిక్ వాహనాలు) నమోదయ్యాయని, 1,742 ఛార్జింగ్ స్టేషన్లు పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి లోక్‌సభకు తెలిపారు.
బ్యాటరీ మార్పిడి విధానం గురించి గడ్కరీ మాట్లాడుతూ.. మొత్తం 85 శాతం లిథియం ఐరన్ బ్యాటరీని భారతదేశంలోనే తయారు చేస్తున్నామని చెప్పారు. బ్యాటరీల పనితీరుపై ప్రశ్నకు సమాధానంగా ఆయన ఇలా అన్నారు.. “మేము బ్యాటరీలో స్థిర ప్రమాణాన్ని కలిగి ఉన్నాము. ఎవరైనా నిర్ణీత ప్రమాణాల ప్రకారం పని చేయకపోతే, వారిపై చర్యలు తీసుకుంటాము. ” అని హెచ్చరించారు.
ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జింగ్ చేయడానికి గ్రీన్ ఎనర్జీని ఉపయోగించడమే మా ప్రాధాన్యత అని గడ్కరీ చెప్పారు. కొత్త స్టార్టప్‌లకు అవకాశం కల్పిస్తూ అన్ని కొత్త పరిశోధనలను అలరించడమే ప్రభుత్వ విధానమని, దీని ద్వారా వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఆర్థికంగా లాభసాటిగా ఉండే సముచిత సాంకేతికతను నెలకొల్పవచ్చని ఆయన అన్నారు.
” ప్రతి 40 కి.మీకి ఛార్జింగ్ సౌకర్యాలను NHAI అభివృద్ధి చేస్తుందని , తాము సోలార్, పవన శక్తిని ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నాము” అని రవాణా మంత్రి గట్కరీ తెలిపారు.