Sunday, December 8Lend a hand to save the Planet
Shadow

హైద‌రాబాద్‌లో One Moto ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌

Spread the love

హైద‌రాబాద్‌లో One Moto ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌

 

బ్రిటిష్ బ్రాండ్ ప్రీమియం EV త‌యారీ సంస్థ .. One Moto.. భార‌త‌ దేశంలో తన మొదటి ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ను (అనుభవ కేంద్రాన్ని) గురువారం హైద‌రాబాద్‌లో ప్రారంభించింది. ఈ ఎక్స్‌పీరియన్స్ హబ్‌లో కస్టమర్‌లు వ‌న్ మోటో ఉత్పత్తులను, సాంకేతికతను స్వ‌యంగా ప‌రిశీలించేందుకు అవ‌కాశం ఉంటుంది. EVల‌పై వారికి మరింత జ్ఞానాన్ని అందించడం లక్ష్యంగా ఈ ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ను MCube ఆటోమోటివ్స్ అనే సంస్థ నిర్వహిస్తుంది.

 

ఎక్స్‌పీరియ‌న్స్ హబ్‌ని ప్రారంభించిన సందర్భంగా వన్ మోటో ఇండియా వ్యవస్థాపకుడు / ప్రమోటర్ మహమ్మద్ ముజమ్మిల్ రియాజ్ మాట్లాడుతూ.. “కస్టమర్ EVల గురించి తెలుసుకోవాలి. పూర్తి సమాచారంతో మంచి నిర్ణయం తీసుకోవడానికి ఉత్పత్తి నాణ్యతను అర్థం చేసుకోవాలి అనే ఆలోచనతో మేము ఎక్స్‌పీరియన్స్ హబ్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాము,” అని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం.. పరిశ్రమలు & వాణిజ్యం I&C, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ.. “ఇ-మొబిలిటీ మిషన్‌ను సాధించడానికి దేశం మొత్తం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ ఉద్య‌మంలో వన్ మోటో ఇండియా వంటి బ్రాండ్‌లు తోడ్పాటునందిస్తాయని తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *