Ethanol 100 : పర్యావరణానికి అనుకూలమైన ప్రత్యామ్నాయ ఇంధనమైన ‘ఇథనాల్ 100’ (E100)పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈమేరకు ఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ (IOCL) అవుట్‌లెట్ లో ‘ఇథనాల్ 100’ని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే 12,000 అవుట్‌లెట్లలో ఈ-20 ఇంధనం అందుబాటులో ఉందన్నారు. IOCL కు చెందిన 183 రిటైల్ అవుట్‌లెట్‌లు ఇక నుంచి Ethanol 100 ని విక్రయిస్తాయి. ఏప్రిల్ 15 నాటికి, 400 అవుట్‌లెట్‌లు E100ని విక్రయిస్తాయి. గత 10 సంవత్సరాలలో, ఈ ఇథనాల్ వినియోగం ద్వారా రైతులకు అదనపు ఆదాయం పెరుగుతోందని, గ్రామీణ ఉపాధి మెరుగవుతోందని మంత్రి వెల్లడించారు. ఇథనాల్ వాడకంతో 1.75 కోట్ల చెట్లను నాటడానికి సమానమైన కార్బన్ డయాక్సైడ్ తగ్గింపు , రూ. 85,000 కోట్ల విలువైన విదేశీ మారకం ఆదా అయినట్లు వివరించారు.
E20 Petrol అంటే ఏమిటి?
1970లలో బ్రెజిల్‌లో మొట్టమొదటిసారిగా విస్తృతంగా ఉపయోగించారు. E20 ఇంధనం ఇథనాల్ , గ్యాసోలిన్ (పెట్రోల్/డీజిల్) ల సాధారణ మిశ్రమం. ఇందులో 20% ఇథనాల్, 80% గ్యాసోలిన్ కలిగి ఉంటుంది. ఇది కార్లు, ట్రక్కులు, స్కూటర్లు, బైక్‌ల వంటి వాహనాల్లో ఉపయోగిస్తారు. పర్యావరణ అనుకూలమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న ఇంధనాల వైపు వెళ్లడానికి E20 ఒక మంచి మార్గం. చెరకు తోపాటు మొక్కల గింజల అవశేషాల నుండి ఇథనాల్ సంగ్రహిస్తారు. తద్వారా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను తయారు చేయడం ద్వారా చెరకు సాగు, చక్కెర పరిశ్రమను బలోపేతం చేస్తుంది. ప్రత్యక్షంగా చెరుకు రైతులకు ఎంతో మేలు కలుగుతుంది.
గ్యాసోలిన్, ఇథనాల్ లేదా ఈ రెండింటిలో ఏదైనా ఇంధనంతో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ వెహికల్స్ (FFVలు)తో సహా వివిధ వాహనాల్లో ఇథనాల్ 100ని ఉపయోగించవచ్చు. భవిష్యత్ లో వాహనాల్లో ఇదే ప్రధాన ఇంధనం అయ్యే అవకాశం ఉంది.
పెరిగిన లభ్యత: ఇథనాల్ 100 ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోని 183 రిటైల్ పెట్రోల్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నారు. 2025-26 నాటికి దేశవ్యాప్తంగా 20% ఇథనాల్ మిశ్రమాన్ని వినియోగించాలనే లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతోంది. ఈ లక్ష్యం ఇప్పుడు ఇథనాల్ 100 వంటి ఇథనాల్ ప్రారంభంతో పురోగతిని సాధించింది. అలాగే పలు చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) 131 ఇథనాల్ ప్లాంట్‌లతో దీర్ఘకాలిక ఆఫ్‌టేక్ ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.
E20 Fuel Benefits : E20 ఇంధనం ఏమిటి? ఈ కొత్త పెట్రోల్ తో వాహనాల మైలేజీ, ధర ఎంత వివరాలు ఇవే..
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.