Home » Eltra City electric 3-wheeler | ఒక్కసారి చార్జ్ తో 160 కి.మీ మైలేజీ ఇచ్చే కొత్త ఎలక్ట్రిక్ ఆటో..

Eltra City electric 3-wheeler | ఒక్కసారి చార్జ్ తో 160 కి.మీ మైలేజీ ఇచ్చే కొత్త ఎలక్ట్రిక్ ఆటో..

Eltra City electric 3-wheeler
Spread the love

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ..  తన సరికొత్త ఆవిష్కరణ అయిన గ్రీవ్స్ ఎల్ట్రా సిటీని (Eltra City electric 3-wheeler) ప్రారంభించింది.  ఈ ఎలక్ట్రిక్ 3-వీలర్ ప్యాసింజర్ వాహనం 9.6 kW మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది.  ఇందులో 10.8 kWh లిథియం-అయాన్ బ్యాటరీ అమర్చారు.  ఇది 14-డిగ్రీ గ్రేడబిలిటీ, 49 Nm టార్క్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది పట్టణ ట్రాఫిక్ పరిస్థితుల్లో  మృదువైన,  సమర్థవంతమైన ప్రయాణానికి అనుకూలంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.  రియల్ టైమ్ సమాచారం, నావిగేషన్ కోసం IoT సామర్థ్యాలను కలిగి ఉన్న ఆధునిక 6.2″ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో డ్రైవర్, ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ వాహనం రూపొందించబడింది.

ముఖ్యంగా, గ్రీవ్స్ ఎల్ట్రా సిటీ పూర్తి మెటల్ బాడీ, సమగ్రమైన 3-సంవత్సరాల వారంటీతో, 5 సంవత్సరాల వరకు పొడిగించబడేలా, దాని వినియోగదారులకు భరోసా ఇస్తుంది. EV ఒకే ఛార్జ్‌పై సుమారు 160 కిలోమీటర్ల మైలేజీ ని అందిస్తుంది.

Eltra City electric 3-wheeler ముఖ్యమైన ఫీచర్స్..

  • ఒక్కో ఛార్జీకి 160+ కిమీ రేంజ్
  • 3 సంవత్సరాల వారంటీ
  • IoT సామర్థ్యాలతో 6.2″ డిజిటల్ క్లస్టర్
  • ఆక్వా బ్లూ  లూనార్ వైట్ రంగులలో లభిస్తుంది

ఎలక్ట్రిక్ త్రీ వీలర్ లాంచ్ సందర్భంగా గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 3W బిజినెస్ విభాగం సీఈవో  నిర్మల్  మాట్లాడుతూ, “గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన  త్రీవీలర్ విభాగం  వేగంగా వృద్ధి సాధిస్తోంది. గ్రీవ్స్ ఎల్ట్రా సిటీ ఎలక్ట్రిక్ ఆటో.. పట్టణాల్లో  సులభతరమైన ప్రయాణాన్ని అందించాలనే  లక్ష్యంతో తీసుకొచ్చాము.  మా కస్టమర్‌లకు మరో అత్యుత్తమ పట్టణ రవాణా పరిష్కారాన్ని అందజేస్తుంది. అని తెలిపారు.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.  అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *