Adani Green Energy | అదానీ గ్రీన్ ఎనర్జీ గుజరాత్‌లోని తన 300 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులో అదనంగా 126 మెగావాట్ల ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది కంపెనీకి సంబంధించి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) అనుబంధ సంస్థ అయిన అదానీ విండ్ ఎనర్జీ కచ్ ఫోర్ లిమిటెడ్ (AWEK4L), గుజరాత్‌లో 126 మెగావాట్ల విండ్ పవర్ ను విజయవంతంగా అమలు చేసింది .
గతంలో 174 మెగావాట్లతో కలిపి , ప్రాజెక్ట్ ఇప్పుడు మొత్తం 300 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
పర్యావరణ ప్రభావం:
ఈ ప్రాజెక్ట్ ఏటా 1,091 మిలియన్ల విద్యుత్ యూనిట్లను ఉత్పత్తి చేస్తుందని, పునరుత్పాదక ఇంధన రంగానికి గణనీయంగా దోహదపడుతుందని అంచనా .
ఇది సంవత్సరానికి సుమారుగా 0.8 మిలియన్ టన్నుల CO2 ఉద్గారాల తగ్గించడంలో దోహద పడుతుంది.
Adani Green Energy AGEL భారతదేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియోను నిర్వహించడం ద్వారా మార్కెట్ లీడర్‌గా మొత్తం 9,604 MW సామర్థ్యంతో. తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటోంది. యుటిలిటీ-స్కేల్ గ్రిడ్-కనెక్ట్ చేయబడిన సోలార్, విండ్, హైబ్రిడ్ పునరుత్పాదక పవర్ ప్లాంట్ డెవలప్ మెంట్, మేనేజ్ మెంట్ ఆపరేషన్‌లో AGEL ప్రత్యేకత కలిగి ఉంది. ప్రస్తుత ఆపరేటింగ్ పునరుత్పాదక పోర్ట్‌ఫోలియో 9.5 GW మించి 12 రాష్ట్రాలలో విస్తరించి ఉంది. AGEL భారతదేశంలో అతిపెద్ద పునరుత్పాదక శక్తి సంస్థగా తన హోదాను కొనసాగిస్తోంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో జాయిన్ కండి.