Ethanol News | దేశవ్యాప్తంగా సుస్థిరమైన రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు, గ్రీన్ మొబిలిటీని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) తన E20 ఫ్యూయల్ స్టేషన్లను విస్తరించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది . E20 పెట్రోల్ అంటే (20% ఇథనాల్ మిళితం) 20% అన్‌హైడ్రస్ ఇథనాల్ మిశ్రమం, 80% మోటారు గ్యాసోలిన్ కలిపి E20 పెట్రోల్ గా తయారుచేస్తారు
BPCL యొక్క E20 నెట్‌వర్క్ 4,279 ఇంధన స్టేషన్‌లకు విస్తరించింది, ఇది కంపెనీ మొత్తం స్టేషన్లలో 18% కవర్ చేస్తుంది, భారతదేశ ప్రయాణాన్ని హరిత భవిష్యత్తు వైపు నడిపిస్తుంది.
పెట్రోల్, డీజిల్ దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించడం, కొత్త ఉద్యోగాలను సృష్టించడం, రైతులకు మెరుగైన వేతనం అందించడం, పర్యావరణ ప్రయోజనాలను అందించడం. వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులను మెరుగుపరచడం వంటి అనేక కీలక లక్ష్యాలను సాధించడానికి కేంద్ర ప్రభుత్వం జీవ ఇంధనాలను చురుకుగా ప్రోత్సహిస్తోంది.
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) 2023లో E20 పెట్రోల్‌ను విక్రయించడం ప్రారంభించాయి. ప్రభుత్వం ప్రకారం, E20 2025 నాటికి దేశం మొత్తాన్ని కవర్ చేస్తుంది.
అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం, సెప్టెంబర్ 1, 2024 నాటికి, మొత్తం 82,617 PSU రిటైల్ అవుట్‌లెట్‌లలో 16,059 PSU అవుట్‌లెట్‌లు E20 ఇథనాల్-బ్లెండెడ్ మోటార్ స్పిరిట్‌ను పంపిణీ చేస్తున్నాయి.
ఆగస్టులో, పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 15.8%కి చేరుకుంది. నవంబర్ 2023 నుండి ఆగస్టు 2024 వరకు ఇథనాల్ మిశ్రమం 13.6%కి చేరుకుంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..