మీ స్కూటర్ బ్యాటరీ హెల్త్ చెకప్ చేసుకోవచ్చు..
iPower Batteries, Electric One కంపెనీ భాగస్వామ్యంతో ఏర్పాటు
భారతదేశంలో iPower Batteries, Electric One కంపెనీలు సంయుక్తంగా 500 EV బ్యాటరీ ఆరోగ్య చెకప్, రీప్లేస్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. FY22-23లో భారతదేశంలో 500 EV బ్యాటరీ ఆరోగ్య తనిఖీ & భర్తీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి iPower Batteries కంపెనీ ఎలక్ట్రిక్ వన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వారు బడా OEMల నుంచి అన్ని ప్రముఖ EV మోడళ్ల వినియోగదారుల అవసరాలను తీర్చగలరని పేర్కొన్నారు.
iPower Batteries Private Limited FY22-23లో భారతదేశంలో 500 EV battery health check-up centres ఏర్పాటు చేయడానికి ఎలక్ట్రిక్ వన్‌తో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ రకమైన మొదటి అవుట్‌లెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను సమయానికి తనిఖీ చేసి, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా హై-గ్రేడ్ లిథియం బ్యాటరీలను భర్తీ చేస్తాయని కంపెనీ తెలిపింది.
FY22-23లో దేశవ్యాప్తంగా ఇటువంటి 500 కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. ఈ సెంటర్లను ఎలక్ట్రిక్ వన్, iPower Batteries సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఈ బ్యాటరీ హెల్త్ చెక్-అప్, రీప్లేస్‌మెంట్ సెంటర్‌లు హీరో ఎలక్ట్రిక్, ఒకినావా, ఆంపియర్, బెన్లింగ్, కైనెటిక్, ఒకాయ మొదలైన ప్రముఖ కంపెనీల నుంచి అన్ని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారుల అవసరాలను తీరుస్తాయని కంపెనీ వెల్లడించింది.
iPower Batteries తాము ఈ బ్యాటరీ సంబంధిత సేవలను సరసమైన ధరలకు, అలాగే 3 సంవత్సరాల వారంటీలతో అందిస్తామని పేర్కొంది. బ్యాటరీ టెస్టింగ్, రీప్లేస్‌మెంట్ గురించి శిక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కాగా iPower యొక్క బ్యాటరీ తయారీ, R&D (పరిశోధన & అభివృద్ధి) ఫ్యాక్టరీ హరియాణాలోని కుండ్లిలో ఉంది. EV battery health check-up centres
ఈ తాజా ఒప్పందంపై iPower Batteries MD & వ్యవస్థాపకుడు వికాస్ అగర్వాల్ మాట్లాడుతూ.. “ఇటీవలి కాలంలో EV వాహనాలకు మంటలు అంటుకోవడం వల్ల వినియోగదారుల్లో ఆందోళన మొదలైందని తెలిపారు. మొత్తం EV సెగ్మెంట్ గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాగా ఎలక్ట్రిక్ వన్ (Electric One ) తన ప్రస్తుత స్టోర్ బేస్ 82 స్టోర్ బేస్ నుండి ఈ FYలో 250 స్టోర్లను ప్రారంభించాలని యోచిస్తోంది. ఎలక్ట్రిక్ వన్ వ్యవస్థాపకుడు & CEO అమిత్ దాస్ మాట్లాడుతూ.. “కంపెనీ తన డీలర్ భాగస్వాములకు రిటైల్ అమ్మకాలను పెంచేందుకు 15 మిలియన్ USD కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది.