Atum-solar-charging-stations

EV వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌

Spread the love

దేశ‌వ్యాప్తంగా ATUM 250 Ev Solar Charging Stations
తెలంగాణ‌లో 48 EV స్టేష‌న్ల ఏర్పాటు

 

దేశవ్యాప్తంగా సౌరశక్తితో పనిచేసే 250 Ev Solar Charging Stations ఏర్పాటును పూర్తి చేసినట్లు ATUM Charge సంస్థ మంగళవారం తెలిపింది. ఇందులో తెలంగాణ‌లోనే ఎక్కువ‌గా 48 సోలార్ ఈవీ చార్జింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేశారు.
మహారాష్ట్ర (36),
తమిళనాడు (44),
తెలంగాణ (48),
ఆంధ్రప్రదేశ్ (23),
కర్ణాటక (23),
ఉత్తరప్రదేశ్ (15),
హర్యానా (14),
ఒడిశా (24)
పశ్చిమ బెంగాల్‌ (23).

ATUM Charge సంస్థ యొక్క ప్రతి Ev Solar Charging Stations (ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌)కు దాదాపు 200 చదరపు అడుగుల స్థ‌లం అవసరం. ఒక చార్జింగ్ స్టేష‌న్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి దాదాపు ఒక వారం పడుతుంది. అందుబాటులో ఉన్న ప్రాంతాన్ని బట్టి ఒక్కో స్టేషన్ ధర మారుతుంది.

4కేడ‌బ్ల్యూ కెపాసిటీ

ఆట‌మ్ చార్జ్ కంపెనీ ఇప్పటివరకు 4 KW కెపాసిటీ గల ప్యానెల్‌లను ఏర్పాటు చేసింది. ఇవి ప్రతిరోజూ 10-12 వాహనాలు (టూవీల‌ర్లు, త్రీ, ఫోర్ వీలర్లు) వరకు ఛార్జ్ చేయగలవు, ఏదైనా Electric Vehicle ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6-8 గంటలు పడుతుంది. త్వ‌ర‌లో ఇది అదనంగా 6 KW సామర్థ్యం గ‌ల చార్జ‌ర్‌ను ఏర్పాటు చేయ‌నుంది. ఇది రోజుకు 25-30 వాహనాలను ఛార్జ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

EV Charging Station ఏర్పాటు పై ATUM ఛార్జ్ వ్యవస్థాపకుడు వంశీ గడ్డం మాట్లాడుతూ “250 ATUM ఛార్జ్ EV ఛార్జింగ్ స్టేషన్‌లను ప్రారంభించడంతో, భార‌తదేశంలో EV పర్యావరణ వ్యవస్థకు మద్దతు ఇస్తామనే మా ప్రతిజ్ఞను నిల‌బెట్టుకున్నామ‌ని తెలిపారు.”

“థర్మల్ పవర్ స్టేషన్‌లను క్రమంగా తొలగించడం, అలాగే వాటి స్థానంలో సౌరశక్తితో పనిచేసే స్టేషన్‌లను ఏర్పాటు చేయడం త‌మ లక్ష్యమ‌ని, ప‌ర్యార‌ణ ప‌రిర‌క్ష‌ణ, జీరో ఎమిష‌,న్ కోసం స్థిరమైన ఈవీ చార్జింగ్ నెట్‌వర్క్ ను నిర్మిస్తున్నామ‌ని చెప్పారు.

ATUM సోలార్ రూఫ్‌ల‌ను సరఫరా చేయడానికి అనేక ఇతర ఛార్జింగ్ స్టేషన్ యజమానులతో భాగస్వామ్యం కలిగి ఉందని ATUM ఛార్జ్ తెలిపింది, తద్వారా వారు సాధారణంగా ఆధారపడే అత్యంత కాలుష్యం కలిగించే థర్మల్ పవర్ సోర్స్‌కు బదులుగా గ్రీన్ పవర్ సోర్స్‌ను వినియోగించుకుంటుంది.

For Tech News  visit : Techtelugu

More From Author

విస్తరణ దిశగా HOP Electric Mobility

tata motors

Tata Motors బిగ్గెస్ట్ సేల్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest

BIRC 2025 : 26 దేశాలకు భారత బియ్యం ఎగుమతి

పాకిస్తాన్‌, థాయిలాండ్‌ ఆధిపత్యానికి సవాలు న్యూఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 25: భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతులను పెంచేందుకు జపాన్‌, ఇండోనేషియా, సౌదీ అరేబియా సహా 26 దేశాలను ఎంపిక చేసింది. వీటికి గ్లోబ‌ల్ ఇండెక్స్‌ (GI) గుర్తింపు పొందిన బియ్యం ఎగుమతి చేయనుంది. ఈ ప్రణాళికతో ₹1.8 లక్షల కోట్ల...