రాజస్థాన్‌కు చెందిన Electric Vehicles (EV) తయారీ సంస్థ HOP Electric Mobility లియో (HOP LEO), హాప్ లైఫ్ (HOP LYF) అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. హాప్ ఎలక్ట్రిక్ 2021 జూన్ లో లియో, లైఫ్ ఇ-స్కూటర్లను విడుదల చేసింది. ఇవి రెండూ కూడా ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటారుతో వస్తాయి. ఇవి 72 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తాయి. వీటిని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 125 కి.మీ దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. ఇందులో హాప్ లియో స్కూటర్ ధర రూ. 72,500, కాగా హాప్ లైఫ్ స్కూటర్ ధర రూ. 65,000 (రెండు ధరలు ఎక్స్-షోరూమ్).
గంటకు 50కి.మి స్పీడ్
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు గంటకు 50 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి. వీటిలో 19.5 లీటర్ల బూట్ స్పేస్, ఇంటర్నెట్, జిపిఎస్, మొబైల్ యాప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్లు 180 కిలోల లోడింగ్ సోమర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అలాగే.. వీటిలో ఆటోమేటిక్ లాకింగ్, సెన్సార్, రివర్స్ గేర్, యూఎస్‌బి ఛార్జింగ్, రిమోట్ కీ, యాంటీ-థెఫ్ట్ అలారం, యాంటీ-థెఫ్ట్ వీల్ లాకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇక స్మార్ట్ ఫీచర్స్.. ఇంటర్నెట్, జిపిఎస్ కనెక్టివిటీ ఉంటుంది. ఈ ఫీచర్ల సాయంతో కస్టమర్లు తమ స్మార్ట్‌ఫోన్ ను స్కూటర్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. జియో ఫెన్సింగ్, లైవ్ లొకేషన్ వంటి వివిధ రకాల ఫీచర్లు కూడా ఉంటాయి. భవిష్యత్ లో ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొత్తగా అప్‌డేటెడ్ వెర్షన్లను విడుదల చేయాలని చూస్తోంది. ఇవి రెండూ మరింత మెరుగైన బ్యాటరీ ప్యాక్ లను కలిగి ఉండనున్నాయి.
త్వరలో 10 ఎలక్ట్రిక్ స్కూటర్లు..
తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల రన్నింగ్ ఖర్చు ప్రతి కిలోమీటరుకు కేవలం 20 పైసలు మాత్రమే ఉంటుందని, ఇది పెట్రోల్ తో నడిచే స్కూటర్లతో పోలిస్తే, చాలా తక్కువగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.. హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మరికొద్ది రోజుల్లోనే మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను కూడా మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. వీటిలో ఒక ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కూడా ఉంది. వచ్చే 3 ఏళ్లలో 10 కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తోంది.
హాప్ ఎలక్ట్రిక్ (Hop Electric)
తాజాగా, కంపెనీ తమ సరికొత్త హాప్ ఆక్సో (HOP OXO) ఎలక్ట్రిక్ మోటార్ కు సంభందించిన టీజర్ ను విడుదల చేసేంది. ఈ టీజర్ చిత్రాలను బట్టి చూస్తుంటే, ఈ ఎలక్ట్రిక్ బైక్ ముందు భాగం ఇది హీరో ఎక్స్‌ట్రీమ్ బైక్ ముందు భాగాన్ని తలపించేలా ఉంది.
ఈ ఎలక్ట్రిక్ బైక్ విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని కంపెనీ తెలిపింది.
Hop Electric బైక్‌తో పాటు సరికొత్త హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతానికి, ఇంకా పేరు నిర్ధారించబడిన ఈ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి చార్జ్ పై గరిష్టంగా 150 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ ను ఐస్తుందని కంపెనీ హామీ ఇచ్చింది. అయితే, Hop Oxo ఎలక్ట్రిక్ బైక్ మాత్రం తక్కువ రేంజ్ సామర్థ్యంతో వస్తుందని భావిస్తున్నారు. ఇది పూర్తి ఛార్జింగ్ పై సుమారు 120 కి.మీ రేంజ్ ను ఇస్తుందని సమాచారం. ఇది రివోల్ట్ ఆర్‌వి 400, Pure Ev eCrist 350 వంటి ఎలక్ట్రిక్ బైక్ లకు పోటీ ఇవ్వనుంది.
HOP Electric Mobility తమ ఇ-టూవీలర్ బిజినెస్ ను 2019లో ప్రారంభించింది. దాదాపు రెండు సంవత్సరాల పరిశోధన తర్వాత కంపెనీ జైపూర్‌లో తన మొదటి కార్యాలయాన్ని ప్రారంభించింది. హాప్ ఎలక్ట్రిక్ పరిశ్రమ కూడా ఈ జైపూర్ లోనే ఉంది. దాదాపు 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ ప్రస్తుతం భారతదేశంలోని 12 రాష్ట్రాల్లోని 54 నగరాల్లో సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్ ని కలిగి ఉంది.
మరో విశేషమెంటంటే.. హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇటీవలే 10 కొత్త ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లను కూడా ప్రారంభించింది. ఇంకా మరికొన్ని కొత్త నగరాలకు విస్తరించాలని hop electric చూస్తోంది. కంపెనీ భవిష్యత్తులో 300 కొత్త నగరాల్లో హాప్ ఎలక్ట్రిక్ స్టోర్లు ప్రారంభించనుంది.
For Tech news visit : techtelugu