GoMechanic, EVRE సంస్థల మధ్య ఒప్పందం
EV Charging stations ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సొల్యూషన్ ప్రొవైడర్ EVRE బుధవారం భారతదేశంలోని అన్ని GoMechanic వర్క్‌షాప్‌లలోEV Charging stations: ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సొల్యూషన్ ప్రొవైడర్ EVRE బుధవారం భారతదేశంలోని అన్ని GoMechanic వర్క్‌షాప్‌లలో ev charging paints ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 1,000 EV ఛార్జింగ్ హబ్‌లను ఇన్‌స్టాల్ చేయనున్నట్టు కంపెనీ గతంలోనే ప్రకటన చేసింది. మల్టీ-బ్రాండ్ వెహికల్ సర్వీసింగ్ వర్క్‌షాప్‌లలో మొదటి దశ EV ఛార్జింగ్ స్టేషన్‌లను బెంగళూరు, చెన్నై నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.
భారతదేశ వ్యాప్తంగా కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం ప్రధాన సమస్య గా మారింది. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదలకు కీలకమైన అవరోధంగా నిలిచింది. ఈ నేపథ్యంలో Charging stations సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు EVRE సంస్థ పేర్కొంది.
GoMechanic, EVRE కంపెనీల మధ్య ఒప్పందం ప్రకారం.. GoMechanic 35 నగరాల్లోని 800 కంటే ఎక్కువ వర్క్‌షాప్‌లలో ఎలక్ట్రిక్ వాహనాల యజమానులకు EV ఛార్జింగ్ స్టేషన్‌లను అందించగలదని పేర్కొంది. ఈ ఛార్జింగ్ స్టేషన్‌లను జోడించడం వల్ల కస్టమర్‌లు అన్ని రకాల EV ఛార్జింగ్, కార్ సర్వీస్ అవసరాలకు వన్-స్టాప్ సొల్యూషన్‌ను పొందడానికి GoMechanic వర్క్‌షాప్‌లు కీలకమైన పాయింట్‌లుగా మారుతాయని పేర్కొంది.
ఈ భాగస్వామ్యం గురించి EVRE సహ వ్యవస్థాపకుడు, CEO కృష్ణ కె జాస్తి మాట్లాడుతూ.. తమ భాగస్వామ్యం ఎలక్ట్రిక్ వాహన రంగానికి ఇతోదకంగా సహాయపడుతుందని తెలిపారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ సౌకర్యం కల్పించేలా భారీ EV ఛార్జింగ్ హబ్‌లను నిర్మించడంపై దృష్టి పెడుతున్నామని అన్నారు. దాని అతిపెద్ద EV ఛార్జింగ్ హబ్‌లలో ఒకే సమయంలో 100 ఎలక్ట్రిక్ వాహనాలను చార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.