Festive Discounts on Electric Scooters : భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్వాంటమ్ ఎనర్జీ కొన్ని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లపై దీపావళి ఆఫర్ ను ప్రకటించింది. ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించేందుకు పరిమిత-కాల ఆఫర్ 31 అక్టోబర్ 2024 వరకు అందుబాటులో ఉంటుంది. ఆగ్రా, లక్నో, కాన్పూర్‌లలో కొత్తగా ప్రారంభించబడిన అవుట్‌లెట్‌లతో సహా దేశంలోని అన్ని క్వాంటం ఎనర్జీ షోరూమ్‌లలో ఈ డిస్కౌంట్ ఆఫర్ ను పొందవచ్చు.
మూడు మోడళ్లపై తగ్గింపు ధరలు ఇవే..
కాగా ఈ దీపావళి ఆఫర్ మూడు మోడల్‌లకు వర్తిస్తుంది: అవి ప్లాస్మా X, ప్లాస్మా XR తోపాటు మిలన్. కస్టమర్లు ఇప్పుడు పండుగ సందర్భంగా ఈ స్కూటర్లను తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ప్లాస్మా X ₹1,29,150 నుంచి ₹99,999కి లభిస్తుంది. ప్లాస్మా XR అసలు ధర ₹1,09,999 కాగా, ఆఫర్ కింద రూ.89,095 లకే కొనుగోలు చేయవచ్చు ఇక మిలన్ మోడల్ రూ.85,999 నుంచి ₹79,999 కి తగ్గింది.
స్పెసిఫికేషన్లు ఇవీ..
ఈ క్వాంటమ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు భారతీయ ప్రయాణీకుల కోసం రూపొందించారు. ప్లాస్మా X, ప్లాస్మా XR లు 1500W మోటార్‌ల ద్వారా శక్తిని పొందుతాయి. ఇవి వరుసగా 65 km/h , 60 km/h గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి. ఇక మిలన్ మోడల్ 1000 W మోటారుతో అమర్చబడి, గరిష్టంగా 60 km/h వేగంతో ప్రయాణించగలదు. ఈ స్కూటర్‌లు అత్యుత్తమ మైలేజీ ని అందిస్తాయి. ప్లాస్మా X కోసం ఒక ఛార్జ్‌పై 120 కిమీ, ప్లాస్మా XR, మిలన్ సింగిల్ చార్జిపై 100 కిమీ వరకు రేంజ్ ఇస్తాయి.
కాగా Quantum Energy, 1964 నుంచి ప్రముఖ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారుల (OEMలు) కోసం ఇంజిన్ కాంపోనెంట్‌లను తయారు చేస్తున్న కుసాలవా ఇంటర్నేషనల్ కు చెందిన అనుబంధ సంస్థ, 2022లో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. కంపెనీ అప్పటి నుంచి 10,000 యూనిట్లకు పైగా విక్రయించింది. భారతదేశపు టాప్ 10 EVలలో ఒకటిగా నిలిచింది.
Festive Discounts on Electric Scooters అన్ని క్వాంటం ఎనర్జీ షోరూమ్‌లలో విక్రయాలు, సర్వీస్‌లు, విడిభాగాలతో సహా పూర్తి స్థాయి సేవలను అందిస్తాయి. కస్టమర్‌లు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో టెస్ట్ రైడ్‌లను షెడ్యూల్ చేయవచ్చు లేదా భారతదేశంలోని ఏదైనా షోరూమ్‌లను సందర్శించవచ్చు.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..