Flipkart Big Billion Days Sale

Flipkart | పండుగ బంప‌ర్ ఆఫ‌ర్.. ఫ్లిప్ కార్ట్ లో ఈవీ స్కూట‌ర్ల‌పై భారీ డిస్కౌంట్‌..

Spread the love

Flipkart Big Billion Days Sale : ఎలక్ట్రిక్ వెహికల్ (EV) రంగంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల అమ్మ‌కాలు హెచ్చుతగ్గులకు లోనవుతుండగా, గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ గణనీయంగా తగ్గింది. అయితే భారతదేశంలో EV అమ్మకాలు మాత్రం దూకుడుగా సాగుతున్నాయి. జూలైలో ఈవీ విక్ర‌యాలు రికార్డు సృష్టించాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 (EMPS), జూలై 1 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు అమలులోకి వస్తుంది. ద‌స‌రా, దీపావ‌ళి ప‌ర్వ‌దినాల సంద‌ర్భంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈవెంట్‌ను కొన‌సాగిస్తోంది. వార్షిక ఫెస్టివల్ ఈవెంట్ లో భాగంగా క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ EMI ఆప్ష‌న్లను వినియోగ‌దారుల కోసం అందిస్తోంది. అయితే ఫ్లిప్‌కార్ట్ లో అత్యంత పాపుల‌ర్ అయిన మూడు EV స్కూటర్‌లపై భారీ డిస్కౌంట్ల‌ను అందిస్తోంది. ఆ ఈవీ స్కూట‌ర్ల వివ‌రాలు ఇప్పుడు చూద్దాం..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్: ఓలా ఎస్1 ప్రో

MRP: రూ. 1,34,999 | ఫ్లిప్‌కార్ట్ ధర: రూ. 1,16,499 వరకు

Flipkart Big Billion Days Sale: Ola S1 Pro అనేది ఓలా ఎలక్ట్రిక్ పోర్ట్ పోలియోలో ఫ్లాగ్‌షిప్ మోడల్. ఆగస్ట్ 2024లో కంపెనీ 33 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. S1 ప్రో రిటైల్ ఎక్స్-షోరూమ్ ధర కంపెనీ అధికారి వెబ్ సైట్ లో రూ. 1,34,999 గా ఉంది. కాగా ఓలా ఎలక్ట్రిక్. ఫ్లిప్‌కార్ట్ ఫ్లాట్ రూ. 10,000 తగ్గింపును అందిస్తోంది. ఇది క్రెడిట్ కార్డ్ పై రూ. 3000, రూ. 1,750 వరకు EMI డీల్‌లతో మరింత తగ్గించుకోవ‌చ్చు. కూపన్ లేదా మరో 6 శాతం తగ్గింపు క్యాష్‌బ్యాక్ స్కీమ్ కూడా ఉంది. చివ‌ర‌కు S1 ప్రో రూ. 1,16,499 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది.

బ‌జాజ్ చేతక్ 3202

ఫ్లిప్‌కార్ట్ ధర: రూ. 97,999

బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ చేతక్‌తో స్కూటర్ సెగ్మెంట్‌లోకి తిరిగి ప్రవేశించింది. ఐకానిక్ నేమ్‌ప్లేట్ మూడు వేరియంట్‌లలో లభిస్తుంది అవి చేత‌క్‌ 2903, చేత‌క్ 3202, చేత‌క్ ప్రీమియం. ఇందులో మిడ్-లెవల్ ట్రిమ్ అయిన‌ చేతక్ 3202 ప‌రిశీలిద్దాం.. బజాజ్ ఆటో అధికారికంగా 3202 వెర్షన్‌ను రూ. 1,15,018కి అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో చేతక్ 3202 ధర కేవ‌లం రూ. 97,999ల‌కే అందుబాటులో ఉంది. అంట రూ. 12,000 కంటే త‌క్కువకు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇందులో రూ. 8,519 తగ్గింపు, రూ. 8,500 వరకు విలువైన క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు, EMIలు, కూపన్‌లపై ఈ డిస్కౌంట్లు వ‌ర్తిస్తాయి.

ఏథర్ 450 అపెక్స్

MRP: రూ. 1,94,998, ఫ్లిప్‌కార్ట్ ధర: రూ. 1,73,946

ఏథ‌ర్ అపెక్స్ ఏథర్ 450 లైనప్‌లో ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్. Ather 450 Apex అధికారికంగా రూ. 1,94,998కి అందుబాటులో ఉంది. దీని ఆన్ రోడ్ ప్రైస్‌ రూ. 2 లక్షలకు పైగా ఉంటుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ వేరియంట్ రూ. 1,82,446కి అందుబాటులో ఉంది, అంటే రూ. 10,000 కంటే తగ్గింపు ధ‌ర‌కు ల‌భిస్తోంది. . ఫ్లిప్‌కార్ట్ #OnlyForYou రిబేట్‌కి కాల్ చేస్తుంది, ఇందులో అనేక పేమెంట్ ఆప్ష‌న్లు వివిధ ర‌కాల ఆప్ష‌న్ల ద్వారా Ather 450 Apex ను మీరు రూ. 1,73,946కి సొంతం చేసుకోవ‌చ్చు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

More From Author

Hyderabad electric buses

TGSRTC Electric Buses | రోడ్లపైకి కొత్త‌గా 500 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు.. హైదరాబాద్ లో ఇక డీజిల్ బస్సులు ఉండవు..

Nexon CNG vs Maruti Brezza CNG

Best CNG Cars | ఈ రెండు సీఎన్జీ కార్లలో.. ఏది ఉత్తమమైనదో మీరే తెలుసుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *