TGSRTC Electric Buses | హైదరాబాద్ మహానగరం క్రమంగా డీజిల్ బస్సులను తగ్గించి వాటి స్థానంలో విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. భవిష్యత్ లో హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల ఒక్క డీజిల్ బస్సు కూడా ఉండకుండా ప్రణాళికలు చేస్తున్నామని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈమేరకు కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎండీ వి.సి సజ్జనార్, ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, డాక్టర్ సంజయ్ లతో కలిసి రవాణా, బిసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు.
— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) September 29, 2024
ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ 500 ఎలక్ట్రిక్ బస్సు (TGSRTC Electric Buses) లను ప్రవేశపెట్టింది. ఈసందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 500 ఎలక్ట్రిక్ బస్సులను మొదటి విడతగా ప్రారంభిస్తున్నామని తెలిపారు.ఇందుకోసం జేబీఎం సంస్థ తో ఆర్టీసీ ఒప్పందం చేసుకున్నామని తెలిపారు.
హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. హైదరాబాద్ లో అన్ని ఎలక్ట్రిక్ బస్సులనే నడిపిస్తామనితెలిపారు. తరచూ విప్లవాత్మక మార్పులు చేస్తూ ఆర్టీసీని మందుకు నడిపిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రారంభించిన నాటి నుంచి మహిళలు ఇప్పటివరకు 3,200 కోట్ల విలువైన ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. ఆర్టీసీ బస్సులకు ఇప్పుడు డిమాండ్ పెరిగిందన్నారు. ఆర్టీసీలో మూడువేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. అలాగే కార్మికులకు పిఆర్సి ,కారుణ్య నియామకాలను అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..