ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లోనూ ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయవచ్చు. ఇది వినడానికి కొంతం కొత్తగా ఉన్నా, ఇది నిజమేజ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘బౌన్స్’ (BounceBounce) తన ‘ఇన్ఫినిటీ ఈ1’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆన్‌లైన్ షాపింగ్ యాప్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ విడుదల చేయనుంది. భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయించనున్న మొదటి ఈవీ కంపెనీ బౌన్స్ మొబిలిటీ కానుంది. అయితే అమేజాన్‌లో ఇప్పటికే హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా. ఎన్‌వైఎక్స్, బ్యాట్రీ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మాకానికి అందుబాటులో ఉన్నాయి.
బౌన్స్ కంపెనీ, ఇప్పుడు ఎక్కువమంది కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇప్పుడు బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనే వారు ఫ్లిప్‌కార్ట్ లో కొనేవయచ్చు. ఇది 2022 జూలై 22 నుంచే అందుబాటులోకి వచ్చింది.
15 రోజుల్లో డెలివరీ..
వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకుంటే.. బుక్ చేసుకున్న 15 రోజుల్లో డెలివరీ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సదుపాయం కేవలం ఐదు రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అవి ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర. ఆ తరువాత దశలో దేశవ్యాప్తంగా డెలివరీలు చేయడానికి సన్నాహాలు చేయనున్నారు.
కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలను పొందవచ్చు. కాబట్టి నిస్సంకోచంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను బుక్ చేసుకోవచ్చు. బౌన్స్ స్కూటర్‌ను బుక్ చేసుకున్న తర్వాత , బౌన్స్ డీలర్లు కస్టమర్‌తో టచ్‌లో ఉంటారు. అదే సమయంలో కస్టమర్‌కు స్కూటర్ రిజిస్ట్రేషన్, బీమాకు సంబంధించిన పూర్తి విషయాలలో కూడా వారు సహరిస్తారు. అంతే కాకుండా బుక్ చేసుకున్నాక కస్టమర్లు డెలివరీ అయ్యే వరకు ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయవచ్చు. ఇది అన్ని విధాలుగా కొనుగోలుదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది.