Harithamithra Telugu News

Home EV Updates E-bikes Kratos – Kratos R ఈ-బైక్స్ డెలివరీ షూరు..

Kratos – Kratos R ఈ-బైక్స్ డెలివరీ షూరు..

0
TORK Motors

పూణేకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన  స్టార్టప్.. టోర్క్ మోటార్స్ (Tork Motors) , ఈ ఏడాది జనవరిలో కొత్త క్రాటోస్,  క్రాటోస్ ఆర్  (Kratos and Kratos R) అనే ఎల‌క్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. వాటి ధరలు (ఎక్స్-షోరూమ్ పూణే. ) వరుసగా రూ. 1.08 లక్షలు, రూ. 1.23 లక్షలుగా నిర్ణ‌యించారు.  ఈ బైక్‌ల డెలివరీలు మొదట ఏప్రిల్‌లో ప్రారంభం కావాల్సి ఉండ‌గా, కొన్ని సమస్యల కారణంగా అవి ఆలస్యమయ్యాయి. ఎట్టకేలకు ఇప్పుడు కంపెనీ తన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల (electric two-wheeler) డెలివరీలను ప్రారంభించింది.

టోర్క్ మోటార్స్ మొదటి రోజు 20 యూనిట్ల క్రాటోస్, క్రాటోస్ ఆర్ డెలివరీ చేసింది. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను మహారాష్ట్రలోని పూణెలోని కంపెనీ ప్రధాన కార్యాలయం నుంచి వినియోగదారులకు అందజేయడం జరిగింది. టోర్క్ మోటార్స్ ప్రస్తుతం పూణె, హైదరాబాద్ (Hyderabad), బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ మరియు ఢిల్లీలో మాత్రమే తమ ఉత్పత్తులను అందిస్తోంది. దశలవారీగా ఇతర నగరాలకు విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది.

Kratos స్పెసిఫికేష‌న్లు

స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే.. టోర్క్ క్రాటోస్ ఎల‌క్ట్రిక్ బైక్‌ 5.36 బిహెచ్‌పి,  28 ఎన్ఎమ్‌లకు టార్క్, 7.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారును క‌లిగి ఉంటుంది. అయితే  క్రాటోస్ ఆర్ మోడ‌ల్ మ‌రింత శ‌క్తిమంత‌మైన‌ది. ఇందులో 6 బిహెచ్‌పి, 38 ఎన్ఎమ్‌లను టార్క్ ఉత్ప‌త్తి చేసే 9 కిలోవాట్ మోటార్‌ను అమ‌ర్చారు. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లు 4kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటాయి. అవి అనువైన పరిస్థితుల్లో ఒకే ఛార్జ్‌పై 180 కిమీల పరిధిని అందించగలవని కంపెనీ పేర్కొంది. Kratos – Kratos R

TechteluguTechtelugu

Previous articleFlipkart లో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు
Next articleతెలంగాణ ఆర్టీసీకి 300 ఎలక్ట్రిక్ బస్సులు
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here