Gemopai Ryder Supermax electric scooter launched  

Gemopai Ryder Supermax electric scooter launched  
Spread the love

ఎక్స్-షోరూమ్ ధర  రూ. 79,999

Gemopai Ryder Supermax electric scooter : నోయిడా-ఆధారిత EV స్టార్టప్, Gemopai కొత్త‌గా Ryder SuperMax ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. గ‌తంలో సంస్థ నుంచి వ‌చ్చిన .. లో-స్పీడ్ స్కూట‌ర్ రైడర్ యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్ గా రైడర్ సూపర్‌మ్యాక్స్ అధునాతన ఫీచర్‌లతో ప్ర‌వేశ‌పెట్టారు.

రూ. 79,999 ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్ )తో ప్రారంభించబడిన ఈ రైడర్ సూపర్‌మ్యాక్స్ గరిష్టంగా 2.7 KW శక్తిని అందించే BLDC హబ్ మోటార్‌తో అందించబడింది. స్కూటర్ గరిష్టంగా 60kmph వేగాన్ని అందుకోగలదు. ఇక రేంజ్ విష‌యానికొస్తే ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 100km వరకు ప్రయాణిస్తుంది.
Gemopai Ryder Supermax electric scooter  1.8kW పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్, ఛార్జర్‌తో వ‌స్తుంది. రెండూ AIS-156 కంప్లైంట్. స్కూటర్ బ్రాండ్ యాప్ Gemopai Connect ద్వారా యాప్ కనెక్టివిటీని కూడా కలిగి ఉంటుంది. ఇది రైడర్‌ను స్కూటర్‌కి నిరంతరం కనెక్ట్ చేస్తుంది. స్కూటర్ దాని బ్యాటరీ, స్పీడ్ అలర్ట్‌లు, సర్వీస్ రిమైండర్‌లు, ఇత‌ర అంశాల‌కు సంబంధించి నిరంత‌ర పర్యవేక్షణ చేస్తూనే ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్‌లను అందిస్తుంది.
రైడర్ సూపర్‌మ్యాక్స్ ఆరు రంగులలో లభిస్తుంది. అవి జాజీ నియాన్, ఎలక్ట్రిక్ బ్లూ, బ్లేజింగ్ రెడ్, స్పార్క్లింగ్ వైట్, గ్రాఫైట్ గ్రే తోపాటు ఫ్లోరోసెంట్ ఎల్లో. Ryder SuperMax మార్చి 10 నుండి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని Gemopai షోరూమ్‌లలో అందుబాటులో ఉంటుంది. కస్టమర్‌లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో కూడా స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు.


tech news

Kiran.P

One thought on “Gemopai Ryder Supermax electric scooter launched  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు