బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్-అప్ అల్ట్రావయోలెట్ (Ultraviolette) ఆటోమోటివ్ దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయడంతోపాటు అంతర్జాతీయంగా ఉనికిని విస్తరించడం కోసం చర్యలను వేగవంతం చేసింది. బెంగళూరులోని దాని తయారీ కేంద్రంలో వినియోగదారులకు దాని హై పర్‌ఫార్మెన్స్‌డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ F77 డెలివరీని ప్రారంభించింది.
Ultraviolette Automotive ప్రపంచ దేశాల్లో విస్తరణ ప్రణాళికల కోసం నిధులు సమకూర్చడానికి అలాగే దాని వాహన డెవలపమెంట్ ప్లాట్‌ఫారమ్‌ను బలోపేతం చేసుకునేందుకు $120 మిలియన్లను (రూ. 990 కోట్లు) సమీకరించే ప్రణాళికలను ప్రకటించింది. ఇప్పటి వరకు ఎక్సోర్ క్యాపిటల్, క్వాల్‌కామ్ వెంచర్స్, టీవీఎస్ మోటార్ కంపెనీ, జోహో కార్ప్, గోఫ్రుగల్ టెక్నాలజీస్, స్పెషలే ఇన్వెస్ట్‌లతో సహా పెట్టుబడిదారుల నుండి $55 మిలియన్లు (రూ. 453 కోట్లు) సేకరించింది.
Ultraviolette Automotive సీఈవో, సహ వ్యవస్థాపకుడు నారాయణ్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. “ఎఫ్77 అద్భుతమైన డిజైన్, సమర్థవంతమైన పనితీరుతోపాటు ప్రతి అంశంలోనూ ఉన్నతంగా ఉంటుందని తెలిపారు.
డెలివరీలు కొనసాగుతున్నందున Ultraviolette ఇప్పుడు జాతీయంగా అంతర్జాతీయంగా విస్తరించే ప్రణాళికపై దృష్టి సారిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తోంది. కొత్తగా అంతర్జాతీయ మార్కెట్‌లలోకి ప్రవేశించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Ultraviolette సహ వ్యవస్థాపకుడు, CTO నిరాజ్ రాజ్‌మోహన్ మాట్లాడుతూ Ultraviolette Automotive F77 వాహనాల డెలివరీల ప్రారంభంతో మా తదుపరి దశ వృద్ధిపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. మా భాగస్వాముల నుండి నిధుల ఇన్ఫ్యూషన్ అల్ట్రావయోలెట్‌ను కొత్త వాహన ప్రోగ్రామ్‌లను ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడతాయని తెలిపారు.