Greta-Glide-Electric-Scooter

GLIDE Electric Scooter @ ₹80,000

Spread the love

GLIDE Electric Scooter : గుజరాత్ ఆధారిత EV స్టార్టప్ గ్రేటా ఎలక్ట్రిక్ స్కూటర్స్.. GRETA GLIDE పేరుతో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను లాంచ్ చేసింది.

Greta Electric Scooters కంపెనీని 2019లో రాజ్ మెహతా స్థాపించారు. ఈ కంపెనీ ఇప్ప‌టికే పెడల్-ఆపరేటెడ్ సైకిళ్లు, పెడల్ రిక్షాలు (ప్యాసింజర్ & కమర్షియల్), ట్రైసైకిళ్లు (భారతదేశంలో మొట్టమొదటి రెట్రో-ఫిట్‌మెంట్ కిట్) ఎలక్ట్రిక్‌గా మార్చడానికి కన్వర్షన్ కిట్‌లను అందిస్తోంది.

 GLIDE Electric Scooter ఫీచర్లు

గ్రెటా గ్లైడ్ ఏడు రంగులలో అందించబడుతుంది అవి పసుపు, గ్రే, ఆరెంజ్, స్కార్లెట్ రెడ్, రోజ్ గోల్డ్, క్యాండీ వైట్, జెట్ బ్లాక్.

గ్లైడ్ 2.5 గంటలలోపు వేగంగా ఛార్జింగ్ చేయగల Li-ion బ్యాటరీ ఉంటుంది. ఇది 100 కిమీ పరిధిని క్లెయిమ్ చేస్తుంది.

ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌లోని బ్యాటరీకి కంపెనీ స్టాండర్డ్‌గా 3 సంవత్సరాల వారంటీ ఇస్తోంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ రివర్స్ డ్రైవ్‌తో పాటు 3-స్పీడ్ డ్రైవ్ మోడ్‌లు ఉంటాయి.

సస్పెన్షన్ సెటప్ ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు డ్యూయల్-హైడ్రాలిక్ సెల్ షాక్‌లను వినియోగించారు.

బ్రేకింగ్ సిస్టమ్‌లో ముందు, వెనుక చక్రాల వద్ద హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. అలాగే 3.5 ”ట్యూబ్‌లెస్ టైర్‌లు ఉంటాయి.

బ్యాటరీ కాన్ఫిగరేషన్ – రేంజ్

V2 48V – 24Ah – 60 కి.మీ రేంజ్

V2 60V – 24Ah – 60 కి.మీ

V3 48V – 30Ah – 100 కి.మీ

V3 60V – 30Ah – 100 కి.మీ

GLIDE Electric Scooter ధర

గ్రేటా గ్లైడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రారంభ ధర రూ. 80,000/-. రూ.లక్ష అందిస్తున్నారు. ముందుగా బుక్ చేసుకున్న స్కూటర్లపై 6,000/- తగ్గింపు ల‌భిస్తుంది.

More From Author

HPCL ఔట్‌లెట్ల‌లో Battery Swapping Stations

Okinawa Okhi 90

Okinawa Okhi 90 మార్చి 24న వ‌స్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *