ఒప్పందం కుదుర్చకున్న Honda , HPCL
ఈవీ మొబిలిటీకి బూస్టింగ్..
Hpcl battery swapping stations : ఈవీ మొబిలిటీని ప్రోత్సహించేందుకు ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా ఆధ్వర్యంలోని హోండా పవర్ ప్యాక్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Honda Power Pack Energy India), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) జట్టు కట్టాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో సహకరించడానికి అవగాహన ఒప్పందం (MOU), అలాగే వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాయి. ఇందులో భాగంగా వారు భారతదేశంలోని ప్రధాన నగరాల్లోని HPCLకు చెందిన రిటైల్ అవుట్‌లెట్లలో బ్యాటరీ-షేరింగ్ సేవలను అందించనున్నారు.
ఒక్క నిమిషంలోనే బ్యాటరీ ఎక్స్‌చేంజ్
హోండా మోటార్ కంపెనీ జపాన్ తన కొత్త అనుబంధ సంస్థ.. అక్టోబర్ 2021లో హోండా పవర్ ప్యాక్ ఎనర్జీ ఇండియాను స్థాపించింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లతో ప్రారంభించి బ్యాటరీ షేరింగ్ సేవను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇది ఈ ఎంపిక చేసిన నగరాల్లోని బ్యాటరీ మార్పిడి స్టేషన్‌లు ఏర్పాటుచేసి ఎలక్ట్రిక్ ఆటోల్లో డిశ్చార్జ్ చేయబడిన బ్యాటరీలను తీసుకొని పూర్తిగా ఛార్జ్ చేయబడిన బ్యాటరీలను అందిస్తాయి. బ్యాటరీ షేరింగ్ సర్వీస్, బ్యాటరీ స్వాపింగ్ సేవలతో ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేసే సమయంలో భారీ ఖర్చుతో బ్యాటరీలను కొనాల్సిన పనిలేదు. వాటిని ఈ స్టేషన్లలో మార్చుకుంటే సరిపోతుంది. బ్యాటరీల్లో చార్జింగ్ అయిపోతోందన్న బెంగ కూడా అవసరం లేదు. Battery Swapping Stations
బెంగళూరు మొదలుకొని..
2022 ప్రథమార్థంలో బెంగళూరు నగరం నుంచి కమర్షియల్‌గా తన బ్యాటరీని సర్వీస్ (BaaS) వ్యాపారం ప్రారంభించాలని Honda యోచిస్తోంది. HPCL యొక్క రిటైల్ అవుట్‌లెట్‌లతో సహా వ్యూహాత్మక ప్రదేశాలలో బ్యాటరీ స్వాప్ స్టేషన్‌ల బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దశలవారీగా ఇతర ప్రధాన నగరాలకు ఈ సేవను విస్తరింపజేయనున్నారు. తొలుత త్రీవీలర్ సెగ్మెంట్‌పై దృష్టి సారిస్తామని, క్రమంగా ద్విచక్ర వాహనాలకు కూడా విస్తరిస్తుందని హోండా తెలిపింది.
ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంపై హోండా పవర్ ప్యాక్ ఎనర్జీ ఇండియా ప్రెసిడెంట్ & CMD కియోషి ఇటో మాట్లాడుతూ.. నమ్మకమైన & కస్టమర్-సెంట్రిక్ బ్యాటరీ షేరింగ్‌ని తీసుకురావడానికి Honda, HPCL మధ్య దీర్ఘకాల భాగస్వామ్యం, స్నేహం కోసం తాను ఎదురు చూస్తున్నానని చెప్పారు. భారతదేశంలో సేవ గ్రీన్ ఫ్యూచర్‌ను తీసుకురావడానికి హెచ్‌పిసిఎల్‌తో హోండా సరైన సమయంలో సరైన భాగస్వామిని ఎంచుకుందని తెలిపారు.
HPCL కార్పొరేట్ స్ట్రాటజీ ప్లానింగ్ & బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రజనీష్ మెహతా మాట్లాడుతూ.. HPCL ఇప్పటికే 2040 నాటికి నెట్ జీరో ఎమిషన్ కంపెనీగా మారేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. హోండా వంటి అంతర్జాతీయ సంస్థతో కుదుర్చకున్న భాగస్వామ్యం.. మా లక్ష్యాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు.
Good