ఖట్మాండులో మొదటి అంతర్జాతీయ డీలర్‌షిప్ ఏర్పాటు చేసిన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ
Greaves Electric Mobility | గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ కు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం.. ప్రముఖ వ్యాపార సమ్మేళనం అయిన కెడియా ఆర్గనైజేషన్ (Kedia Organisation) సహకారంతో నేపాల్‌లో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా గ్రీవ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్ఝ ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ విస్తరణ EV ప్రయాణంలో GEMPL ఒక మైలురాయిని సూచిస్తుంది. భారతదేశ సరిహద్దులను దాటి దాని పరిధిని విస్తరించడం.. నేపాల్ మార్కెట్ యొక్క అభివృద్ధి చెందుతున్న డిమాండ్లను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఈ కంపెనీ. నేపాల్‌లో ఆంపియర్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు, మార్కెటింగ్, పంపిణీ మరియు అమ్మకాల కోసం కేడియా ఆర్గనైజేషన్ ప్రత్యేక అధీకృత పంపిణీదారుగా ఉంటుంది.
ఆంపియర్ తన తొలి ఫ్లాగ్‌షిప్ షోరూమ్‌ను నేపాల్ రాజధాని ఖాట్మండులోని టేకులో ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా మల్టీ అవుట్‌లెట్‌లు, డీలర్‌షిప్‌ల dealership ను స్థాపించడానికి సిద్ధమైంది. నేపాల్‌లో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. పర్యావరణ స్థిరత్వం, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వ మద్దతుపై పెరుగుతున్న స్పృహ కారణంగా అక్కడ EV అమ్మకాలు బాగా వృద్ధి చెందాయి.
నేపాల్ మార్కెట్‌లో ఆంపియర్ మాగ్నస్ (Ampere Magnus), ఆంపియర్ ప్రైమస్ విక్రయాలు చేపట్టనుంది. ప్రైమస్ ఒక PMS మోటార్, బెల్ట్ డ్రైవ్, నావిగేషన్ కోసం స్మార్ట్ కనెక్ట్ క్లస్టర్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. అలాగే ఆంపియర్ మాగ్నస్ అత్యున్నత స్థాయి పనితీరుతో అద్భుతమైన ఫీచర్ల శ్రేణిని కలిగి ఉంది.
Greaves Electric Mobility ప్రైవేట్ లిమిటెడ్ CEO సంజయ్ బెహ్ల్ మాట్లాడుతూ.. “మేము నేపాల్‌లోకి ప్రవేశించడం మా ప్రపంచ విస్తరణలో ఒక ముఖ్యమైన పురోగతిగా ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము. స్థిరమైన మొబిలిటీపై మాకు ఉన్న నిబద్ధత నేపాల్‌లోని డైనమిక్ మార్కెట్‌తో స్ధిరపడడానికి వీలవుతుంది. మా అధునాతన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రారంభించేందుకు మేము సంతోషిస్తున్నాము. కేడియా ఆర్గనైజేషన్‌తో భాగస్వామ్యం కలిగి ఉండడం ఎంతో సంతోషంగా ఉంది’ అని తెలిపారు.
కెడియా ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యం కేడియా మాట్లాడుతూ “కేడియా ఆర్గనైజేషన్- గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నేపాల్‌లో కొత్త ఇంధన విప్లవంలో ముందంజలో ఉన్నాయి. మేము వినూత్నమైన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల శ్రేణిని పరిచయం చేస్తున్నాము. ఇది దేశంలో రవాణా రంగంలో కొత్త శకానికి నాంది పలికింది. అని పేర్కొన్నారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు… కృతజ్ఞతలు..
Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో జాయిన్ కండి.