Home » Ola Electric | ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.20వేల తగ్గింపు.. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకే..

Ola Electric | ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.20వేల తగ్గింపు.. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకే..

ola electric December to Remember
Spread the love

Ola Electric : ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి శుభవార్త..  ఓలా ఎలక్ట్రిక్ తన S1 X+ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 20,000 ఫ్లాట్ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ ‘డిసెంబర్ టు రిమెంబర్’  (December to Remember) ప్రచారంలో భాగంగా తీసుకొచ్చింది. ఇది 31 డిసెంబర్ 2023 వరకు చెల్లుబాటు అవుతుంది. S1 X+ అసలు ధర రూ. 1,09,999. తాజా ఆఫర్ తర్వాత, S1 X+  ధర రూ. 89,999 కే సొంతం చేసుకోవచ్చు.

December to Remember ప్రోగ్రాం కింద ఈ ఇయర్-ఎండ్ స్కీమ్‌తో పాటు ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌లపై రూ.5,000 వరకు డిస్కౌంట్, డౌన్ పేమెంట్, జీరో ప్రాసెసింగ్ ఫీజు, 6.99 శాతం అతి తక్కువ వడ్డీ రేటుపై కోనుగోలు వంటి అనేక ఫైనాన్సింగ్ ఆప్షన్లను అందిస్తోంది.

Ola S1 X+ స్పెక్స్ & ఫీచర్లు

Ola S1 X+ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 6kW హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌, 3kWh బ్యాటరీ ప్యాక్‌ ను కలిగి ఉంటుంది. ఈ పవర్‌ట్రెయిన్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 151 కిమీ గరిష్ట IDC పరిధిని అందిస్తుంది. ఎకో మోడ్‌లో 125 కిమీ, నార్మల్ మోడ్‌లో 100 కిమీ రేంజ్ ని ఇస్తుంది.  పనితీరు విషయానికొస్తే.. ఎలక్ట్రిక్ స్కూటర్ 3.3 సెకన్లలో 0 నుండి 40 kmph వరకు వేగాన్ని అందుకోగలదు. గంటకు 90 kmph వేగంతో దూసుకుపోతుంది.

500W పోర్టబుల్ ఛార్జర్‌ని ఉపయోగించి బ్యాటరీని 7.4 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. ఎంచుకోవడానికి మూడు రైడ్ మోడ్‌లు.. ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్స్ ఉన్నాయి. ఇతర ముఖ్యమైన ఫీచర్లలో 5-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ అన్‌లాక్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఉన్నాయి.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు… కృతజ్ఞతలు..

Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *