GT-Force నుంచి కొత్త ఈవీలు
GT-Force సంస్థ పర్యావరణ అనుకూలమైన మూడు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తోంది. GT డ్రైవ్, GT డ్రైవ్ ప్రో మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ప్రోటోటైప్ ను ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో జరిగిన EV ఇండియా ఎక్స్‌పో 2021లో ప్రదర్శించారు.
GT డ్రైవ్ – GT-ఫోర్స్ హై-స్పీడ్ స్కూటర్
GT డ్రైవ్ – GT-ఫోర్స్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది గరిష్టంగా 60 kmph వేగంతో ప్రయాణిస్తుంది. అయితే ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150 కిమీల వరకు వెళ్లవచ్చు. GT డ్రైవ్ స్కూటర్‌లో లిథియం-అయాన్ బ్యాటరీని వినియోగించారు. ఇందులో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి – ఎకానమీ, స్టాండర్డ్ అలాగే టర్బో. అంతేకాకుండా ఈ స్కూటర్ క్రూయిజ్ కంట్రోల్ సౌలభ్యంతో వస్తుండడం మరో గమనించదగిన విషయం.
GT డ్రైవ్ ప్రో స్పెసిఫికేన్లు..
GT డ్రైవ్ ప్రో – GT డ్రైవ్ ప్రో అనేది కంపెనీ నుండి వస్తున్న స్లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది చిన్న గమ్యస్థానాల కోసం వినియోగంచుకునేవారి కోసం అందుబాటులో తెచ్చారు. పట్టణ వాసుల అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన ఈ స్కూటర్ మహిళలకు పిల్లలకు, వృద్ధులకు చక్కగా సరిపోతుంది. GT డ్రైవ్ ప్రో ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 75 కి.మీల దూరం ప్రయాణించగలదు. అలాగే ఈ వాహనం గంటకు 25 కిమీ వేగంతో వెళ్తుంది. GT డ్రైవ్ ప్రోను లెడ్-యాసిడ్ బ్యాటరీ అలాగే లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పొందవచ్చు. దీనికి డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు.
మోటార్‌సైకిల్ ప్రోటోటైప్
మోటార్‌సైకిల్ ప్రోటోటైప్ – కంపెనీ తన రాబోయే మోటార్‌సైకిల్ ప్రోటోటైప్‌ను కూడా ఈవీ ఎక్స్‌పోలో ప్రదర్శించింది. విద్యుత్తుతో నడిచే మోటార్‌సైకిల్‌ను డెలివరీ చేయడానికి కంపెనీ చేసిన మొదటి ప్రయత్నం.. ఈ ఎక్స్‌పోలో ప్రేక్షకులు దీనిని ఆసక్తిగా తిలకించారు. వచ్చే ఏడాది మధ్య నాటికి మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
GT-ఫోర్స్ సహ వ్యవస్థాపకుడు & CEO ముఖేష్ తనేజా మాట్లాడుతూ, “EVలు సుదూర ప్రయాణ అవసరాలను తీర్చలేకపోవచ్చు లేదా అవి అసౌకర్యంగా ఉండవచ్చు అనే అపోహను ప్రజలు కలిగి ఉన్నారు. దేశంలోని ప్రతి మూల మూలలో తమ హైస్పీడ్ వాహనాలను అందుబాటులో ఉంచడానికి మేము తీవ్రంగా కృషి చేస్తున్నాము. ఎక్కువ మంది ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యేలా డిస్ట్రిబ్యూటర్ల నెట్‌వర్క్‌ని విస్తరించేందుకు టీమ్ అన్ని ప్రయత్నాలు చేసింది. అని పేర్కొన్నారు.
GT-ఫోర్స్ సహ-వ్యవస్థాపకుడు మిస్టర్ రాజేష్ సాయిత్య మాట్లాడుతూ “భారతదేశం క్రమంగా ICE నుండి EV వైపు కదులుతోంది. వినియోగదారులకు అందుబాటులో ఉండే నాణ్యమైన ఉత్పత్తులను అందించడం ద్వారా మేము మా పాత్రను పోషిస్తున్నామని తెలిపారు. మా స్లో స్పీడ్ ప్రోడక్ట్‌లు పిల్లలు, మహిళలు, అలాగే తక్కువ దూరం గల గమ్యస్థానాల కోసం చక్కగా ఉపయోగపడనున్నాయని చెప్పారు.
Vehicle Specifications
మరిన్ని అప్డేట్ల కోసం హరితమిత్ర వెబ్‌సైట్‌ను సందర్శించండి.. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన వీడియోల కోసం మా Haritha mithra YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి..! |
Wonderful