Sunday, December 8Lend a hand to save the Planet
Shadow

One-Moto Electa .. సింగిల్ చార్జిపై 150కి.మి రేంజ్, 100కి.మి స్పీడ్ 

Spread the love

ఇండియ‌న్ మార్కెట్‌లోకి బ్రిటీష్ ఈవీ బ్రాండ్ One Moto Electa

 

 

 

 

 

One Moto Electa : బ్రిట‌న్‌కు చెందిన ప్ర‌ముఖ ఈవీ బ్రాండ్ One Moto, భారతీయ మార్కెట్లోకి ప్ర‌వేశించింది. రూ.1,99,000 (ఎక్స్-షోరూమ్ ధర) ధరకు తన కొత్త హై-స్పీడ్ e-Scooter Electa ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త హై-స్పీడ్ ఈ-స్కూటర్ “ఆధునిక పురాత‌న డిజైన్ల ను గుర్తు చేసేలా తీర్చ‌దిద్దారు. దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించే ఉద్దేశంతో ఈవీల‌ను విడుద‌ల చేస్తోంది.

వ‌న్‌మోటో మూడో వాహ‌నం One-Moto Electa

వ‌న్ మోటో న‌వంబ‌రు 2021లో భారతీయ మార్కెట్‌లో రెండు వాహ‌నాల‌ను విడుద‌ల చేసింది. అందులో మొద‌టిది కముటా (హై-స్పీడ్ స్కూటర్), రెండోది బైకా (హై-స్పీడ్ స్కూటర్). వీటిపై కస్టమర్లు, ఆటో మొబైల్ నిపుణులు ఇండస్ట్రీ వ‌ర్గాల నుంచి అద్భుతమైన స్పందన వ‌చ్చిది. దీంతో మ‌రో 3 నెలల వ్యవధిలోనే మూడో వాహ‌నాన్ని ఇండియ‌న్ మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. మూడో బైక్ పేరు Electa.

ఇక అన్ని One-Moto వాహ‌నాలు జియో-ఫెన్సింగ్, IoT, బ్లూటూత్‌తో సహా ఎండ్-టు-ఎండ్ టెక్నాలజీ ని స‌పోర్ట్ చేసే ‘వన్-యాప్’తో వస్తాయి. యాప్ మెయింటెనెన్స్ అలర్ట్‌లు, కమ్యూటింగ్ బిహేవియర్ మొదలైన డేటాను క్యాప్చర్ చేస్తుంది. తద్వారా ఇది రోడ్డుపై అత్యుత్తమ కనెక్ట్ చేయబడిన వాహనంగా మారుతుంది.

ఎల‌క్ట్ర‌క్ వాహ‌న రంగంలో One-Moto Electa రాక‌తో వినియోగదారులకు అత్యంత అధునాతన సాంకేతికతతో రెట్రోస్పెక్టివ్ డిజైన్‌ను పరిచయం చేసిన‌ట్టైంది. బ్రిటీష్ స్టైల్ తో కూడిన పర్యావరణ అనుకూలమైన, సొగసైన రైడ్‌ను ఆస్వాదించాలనుకునే ప్రయాణీకుల చక్కటి జీవనశైలికి ఈ వాహ‌నం సరిపోతుంది.

సింగిల్ చార్జిపై 150కి.మి రేంజ్, 100కి.మి స్పీడ్

కొత్త ఎలెక్టా 6 రంగులలో అందుబాటులో ఉంది. ( మ్యాట్ బ్లాక్, షైనీ బ్లాక్, బ్లూ, రెడ్, గ్రే) మార్కెట్‌లోని ఇతర వాహ‌నాల‌ను నుంచి వేరు చేసేలా క్లాసీ రూపాన్ని కలిగి ఉంది. ఎలెక్టా లో 72V , 45AH, డిటాచ‌బుల్ లిథియం-అయాన్ బ్యాటరీ అమర్చబడి ఉంది. ఇది కేవలం 4 గంటలలో పూర్తిగా ఛార్జ్ చేయబడుతుంది. ఇ-స్కూటర్ సులువుగా గంటకు 100 కి.మీ గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150 కి.మీల దూరం వ‌ర‌కు ప్ర‌యాణించ‌వ‌చ్చు. ఇది 4KW QS బ్రష్‌లెస్ DC హబ్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది.

మూడేళ్ల వారంటీ

One-Moto Electa వినియోగదారులకు మోటార్, కంట్రోలర్, బ్యాటరీపై 3 సంవత్సరాల వారంటీని అందిస్తోంది. రైడ్ అనలాగ్ డిస్‌ప్లే, హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్‌లు (ముందు/వెనుక), మ‌ల్టిపుల్ క్రోమ్ అప్‌గ్రేడ్‌లతో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి.

వన్-మోటో ఇండియా భాగస్వామి & ప్రమోటర్ మిస్టర్ ముజమ్మిల్ రియాజ్ మాట్లాడుతూ.. “భారత ఆటోమోటివ్ మార్కెట్ ICE నుండి EVకి మారడంపై దృష్టి సారించింది, కాబట్టి, మిషన్‌ను కొనసాగించాలంటే ఫ‌స్ట్ ఎక్స్‌పీరియ‌న్స్ ఎంతో కీల‌క‌మ‌ని తాము భావిస్తున్న‌ట్లు తెలిపారు. ప్రత్యేకమైన వాటి కోసం చూస్తున్న వారి EV అవసరాలను తీర్చాలనే లక్ష్యంతో తాము భారతీయ మార్కెట్లోకి ప్రవేశించామ‌ని తెలిపారు.

One-Moto India, CEO శ్రీ శుభంకర్ చౌదరి మాట్లాడుతూ.. యువ‌త‌కు నాణ్యమైన ఉత్పత్తులను అందించడంపై దృష్టి సారించామ‌ని, హై-స్పీడ్ క్వాలిటీ ప్రీమియం ఉత్పత్తులను ప్రారంభించి, కీలకమైన మెట్రో నగరాల నుండి పంపిణీని ప్రారంభించాలనే ఆలోచన ఉంద‌న్నారు. మా స్కూటర్‌లతో భారతీయ కస్టమర్‌లకు సేవ చేయాలనుకుంటున్నామని, రాబోయే ఆరు నెలల్లో మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఢిల్లీ-ఎన్‌సిఆర్, హర్యానా పంజాబ్‌తో సహా దేశంలోని హాట్ మార్కెట్‌లలో మా పట్టును బిగించుకోవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. .

ధర వివ‌రాలు

  •  One-Moto Electa – రూ.1.99 లక్షలు.
  •  వన్-మోటో బైకా – INR 1.80 లక్షలు.
  •  వన్-మోటో కమ్యుటా – 1.30 లక్షలు.

ల‌భ్య‌త‌

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, పాండిచ్చేరి, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి కీలక మార్కెట్లతో ప్రారంభించి క్రమంగా దేశవ్యాప్తంగా ఉనికిని బలోపేతం చేయడం One-Moto లక్ష్యం. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 6-8 కొత్త రాష్ట్రాలలోకి ప్రవేశించాలని వన్ మోటో లక్ష్యం గా పెట్టుకుంది.

మరిన్ని అప్‌డేట్‌ల కోసం హ‌రిత‌మిత్ర వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు సంబంధించిన వీడియోల కోసం మా  Haritha mithra YouTube ఛానెల్‌ను స‌బ్‌స్క్రైబ్ చేసుకోండి..!

 

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *