Home » Okaya Electric నుంచి హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్

Okaya Electric నుంచి హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్

Spread the love

ఎల‌క్ట్రిక్ వాహ‌నాల బ్యాట‌రీల త‌యారీలో గుర్తింపు పొందిన Okaya  Electric ఎల‌క్ట కంపెనీ ఇటీవ‌ల గ్రేటర్ నోయిడాలో జరిగిన EV ఎక్స్‌పో 2021లో భారతదేశంలో తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ Okaya Faast ను విడుదల చేసింది. తాజాగా కొత్త ఒకాయ ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోళ్ల ఆన్‌లైన్‌లో బుకింగ్‌ల‌ను తెరిచింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 2,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి లేదా వారి సమీపంలోని ఒకాయ EV డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. దీని ధ‌ర ఎక్స్-షోరూమ్ (రాష్ట్ర సబ్సిడీలు మినహాయించి)తో రూ. 89,999గా నిర్ణ‌యించారు.

సింగిల్ చార్జిపై 150కి.మి రేంజ్‌

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేష‌న్ విష‌యానికొస్తే కొత్త Okaya Faast గరిష్టంగా గంట‌కు 60-70 kmph వేగంతో దూసుకుపోతుంది. ఇందులో 4.4 kW లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీని వినియోగించారు. ఇక ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 150 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణించ‌వ‌చ్చని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా వాహ‌నం న‌డిపే విధానం, రోడ్డు కండీష‌న్‌ను బట్టి ఒక్కో ఛార్జింగ్‌కు 200 కి.మీ వరకు కూడా వెళ్లవచ్చు. ఇక‌ ఇత‌ర ఫీచర్ల విషయానికొస్తే, Okaya Faast ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌లో LED DRLలతో కూడిన LED హెడ్‌ల్యాంప్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అదనపు భద్రత కోసం కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

Okaya Faast ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ లాంచ్ సందర్భంగా ఒకాయ పవర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ గుప్తా మాట్లాడుతూ.. “భారత‌దేశాన్ని 100 శాతం EV దేశంగా మార్చే దృక్పథానికి ఒకాయ కంపెనీ పూర్తిగా అంకితమైంద‌ని తెలిపారు. Okaya Faast రాక‌తో దేశంలో EVల స్వీకరణను వేగవంతం చేయడానికి తక్కువ ధరతో కూడిన, అధిక-పనితీరు గల ఇ-స్కూటర్‌లను తీసుకువ‌చ్చామ‌ని తెలిపారు. ఈ ఇ-స్కూటర్‌ల కోసం చాలా అవసరమైన ఫాస్ట్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను సృష్టించడం ద్వారా ఒకాయ ఇప్పటికే కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని పేర్కొన్నారు.

Okaya electric scooter
Okaya electric

ఒకాయ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అన్షుల్ గుప్తా మాట్లాడుతూ.. మా ప్రత్యేకమైన ‘ఒకాయ ఫాస్ట్ ఇ-స్కూటర్స్’తో మేము వినియోగదారుల యొక్క మారుతున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్కెట్లో హై స్పీడ్ EVలను తీసుకొస్తున్న‌ట్లు తెలిపారు. అంతేకాకుండా ఒకాయ ప్రారంభించిన మొదటి ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 225 డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసింది. అలాగే, FY22 రెండవ త్రైమాసికంలో ప్రారంభించబడుతుందని భావిస్తున్న EV ఎక్స్‌పోలో ఒకాయ తన రాబోయే ఎలక్ట్రిక్ బైక్, ఫెర్రాటోను ప్రదర్శించింది.

One thought on “Okaya Electric నుంచి హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *