Hero Electric Photon
హీరో ఎలక్ట్రక్ స్కూటర్లలో ఇదే వేగవంతమైనది..
దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం Hero Electric సంస్థ ఇప్పటివరకు ఎన్నో అత్యుత్తమమైన ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించింది. పంజాబ్లోని లుధియానా ఉన్న ఈ హీరో ఎలక్ట్రిక్ సంస్థ నుంచి వచ్చిన ద్విచక్రవాహనాల్లో అత్యంత ప్రజాదరణ పొందింది.. Hero Electric Photon హైస్పీడ్ స్కూటర్. గంటకు 50కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ ఫోటాన్ ఈ-స్కూటర్ సింగిల్ చార్జిపై సుమారు 80కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.
స్పెసిఫికేషన్స్
Hero Electric Photon భారతదేశంలో 2 వేరియంట్లలో అందుబాటులో ఉంది. తెలంగాణలో ఎక్స్‌షోరూం దర 71,440.(ఆగస్టు-2021) ముందు వైపు డిస్క్ బ్రేకులు, వెనుక వైపు డ్రమ్ బ్రేక్‌లను అమర్చారు. హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ రెండు చక్రాల కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో పవర్ మరియు ఎకానమీ అనే రెండు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. ఇది గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. గ్రౌండ్ క్లియరెన్స్ 140ఎంఎం. నగరంలోని ట్రాఫిక్ రోడ్లకు ఇది సరిగ్గా సరిపోతుంది. ఇందులో వాడిన లిథియం అయాన్ బాటరీపై హీరో ఎలక్ట్రిక్ సంస్థ మూడేళ్ల వారంటీ ఇస్తోంది. వ్యారంటీ పీరియడ్‌లో బ్యాటరీలో ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు ఉచితంగా మార్చుకోవచ్చు.
Hero Electric Photon లో రెండు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. పవర్ మోడల్‌ను ఉపయోగిస్తున్నప్పుడు 50 కిలోమీటర్ల వరకు పూర్తి ఛార్జీతో ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. అలాగే ఎకానమీ మోడ్‌లో ఫుల్ ఛార్జిపై రోడ్డు కండిషన్ బట్టి సుమారు 103 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. ఫోటాన్‌లోని రాత్రివేళ స్పష్టమైన విజిబిలిటీ కోసం పాలికార్బోనేట్ హెడ్ లాంప్‌ను వినియోగించారు. ఇక సస్పెన్షన్ విషయానికొస్తే ముందువైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ను గమచించవచ్చు. ఈ బైక్‌ను దొంగలించకుండా యాంటీ-తెఫ్ట్ అలారం వంటి ఫీచర్లు. ఇందులో 72V/26Ah సామర్థ్యం కలిగిన లిథియం అయాన్ బ్యాటరీ, 1200W/1800W సామర్థ్యం గల మోటార్ ఉంటుంది.
రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం..
హీరో ఎలక్ట్రిక్ సంస్థకు చెందిన లోస్పీడ్ ఈ-స్కూటర్ల మాదిరిగా కాకుండా Photon నడిపేవారికి డ్రైవింగ్ లైసెన్స్, పూర్తి రిజిస్ట్రేషన్ అవసరం. ఫోటాన్ Red, silver రంగుల్లో లభ్యమవుతుంది.
Photon స్పెసిఫికేషన్స్..
- Top Speed 45km/h
- Range 80km**
- Battery 72V/26Ah
- BLDC Hub Motor 1200W/1800W
- Wheel Size 10x3inch
- Charging Time 4-5 Hours
- Kerb Weight 87kg
- Gradebility 7 degree
- Licence & Registration Required
ఈ హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ స్కూటర్ కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం కంపెనీ వెబ్‌సైట్‌ను సంప్రదించండి
https://heroelectric.in/
I have been reading out some of your stories and i must say pretty nice stuff. I will definitely bookmark your blog.
Thankyou