గంటకు 60కి.మీ వేగం.. 120కి.ర్ల రేంజ్
హైదరాబాద్‌కు చెందిన ప్యూర్ఈవీ సంస్థ ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో PURE EPluto 7G మార్కెట్లో క్రేజీని సంపాదించుకుంది. ఇది గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లే సామర్థ్యం దీని సొంతం. డ్రైవర్ బరువు, రోడ్డు తీరును బట్టి ఈ వేగంలో మార్పు ఉంటుంది. ఇది ఒక్కసారి చార్జి చేస్తే సుమారు 120కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
వెస్పాలా రిట్రో లుక్ ..
PURE EPluto 7G స్కూటర్‌ను చూడగానే గతంలో ఓ వెలుగు వెలిగిన వెస్పా పెట్రోల్ స్కూటర్ గుర్తుకు వస్తుంది. పాత తరం రూపుతో ఆధునిక హంగుల కలయికతో దీనిని రూపొందించింది మన హైదరాబాదీ స్టార్టప్ కంపెనీ ప్యూర్ ఈవీ. ముందు వెనక పసుపు రంగు ఇండికేటర్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇక హాండిల్ మధ్యలో డిజిటల్ ఎల్‌సిడి డిస్‌ప్లేలో స్పీడ్ , ఓడోమీటర్, టర్న్ ఇండికేటర్, బ్యాటరీ స్టేటస్ బార్స్ వంటి పూర్తి సమాచారం కనిపిస్తుంది.
ఈ స్కూటర్ ఎరుపు, తెలుపు రంగుల్లో అందుబాటులో ఉంది. సీటు లోపల 14.5కిలోల బరువు కలిగిన భారీ బ్యాటరీ అమర్చబడి ఉంటుంది. దీనిని బయటకు తీసి చార్జింగ్ పెట్టుకోవచ్చు. బ్యాటరీ పెద్దగా ఉండడం మూలంగా బూట్ స్థలాన్ని ఎక్కువ మొత్తంలో అక్రమిస్తుంది. దీంతో ఫుల్ ఫేస్ హెల్మెట్ ఇందులో పెట్టుకోవడం సాధ్యం కాదు.
మూడు స్పీడ్ మోడ్‌లు
ప్యూర్ ఈవీ ఈఫ్లూటో 7జీ స్కూటర్‌లో 3 స్పీడ్ మోడ్‌లు ఉన్నాయి. ఫస్ట్ మోడ్‌లో 45 కిలోమీటర్ల వేగంతో, సెకెండ్ మోడ్‌లో 55 కి.మీ, థర్డ్ మోడ్‌లో 60 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. రోడ్డుపై ఎదురుగా వెళ్లే వాహనాలను ఓవర్‌టేక్ చేయడానికి థర్డ్ మోడ్ ఉపయోగపడుతుంది. 150 నుంచి 200కిలోల వరకు బరువును మోయగలుగుతుంది.
ఇందులో ఉపయోగించిన వాటర్‌ప్రూఫ్ BLDC మోటారు 2kW వరకు గరిష్ట శక్తిని అందిస్తుంది. మోటార్ నుంచి ఎలాంటి శబ్దం రాదు. మొత్తం స్కూటర్ బరువు 73 కిలోలు. 165 మిమీ మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉండడంతో స్పీడ్ బ్రేకర్ల వద్ద పెద్దగా ఇబ్బందులు తలెత్తవు.
ముందు చక్రానికి డిస్క్ బ్రేక్‌లు, వెనుక చక్రానికి డ్రమ్ బ్రేకులు వినియోగించారు. ఇందులో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ఉండడం వల్ల కొంత శక్తి కూడా ఉత్పత్తి అవుతుంది.
3 స్పీడ్ మోడ్‌లు
PURE EPluto 7G స్కూటర్‌లో 3 స్పీడ్ మోడ్‌లు ఉన్నాయి. ఫస్ట్ మోడ్‌లో 45 కిలోమీటర్ల వేగంతో, సెకెండ్ మోడ్‌లో 55 కి.మీ, థర్డ్ మోడ్‌లో 60 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. రోడ్డుపై ఎదురుగా వెళ్లే వాహనాలను ఓవర్‌టేక్ చేయడానికి థర్డ్ మోడ్ ఉపయోగపడుతుంది. 150 నుంచి 200కిలోల వరకు బరువును మోయగలుగుతుంది.
ఇందులో ఉపయోగించిన వాటర్‌ప్రూఫ్ BLDC మోటారు, 60v 2.5kW లిథియం అయాన్ బాటరీ(పోర్టబుల్) నుంచి వరకు గరిష్ట శక్తిని పొందుతుంది. ఈ మోటార్ నుంచి ఎలాంటి శబ్దం రాదు. మొత్తం స్కూటర్ బరువు 73 కిలోలు. 165 మిమీ మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉండడంతో స్పీడ్ బ్రేకర్ల వద్ద పెద్దగా ఇబ్బందులు తలెత్తవు. ముందు చక్రానికి డిస్క్ బ్రేక్‌లు, వెనుక చక్రానికి డ్రమ్ బ్రేకులు వినియోగించారు. ఇందులో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ఉండడం వల్ల కొంత శక్తి కూడా ఉత్పత్తి అవుతుంది. వెనుక, ముందు ట్యూబ్ లెస్ టైర్లు చూడోచ్చు.
ఇందులో మరో ఆకర్షణీయమైన ఫీచర్ ఎలక్ట్రానిక్ లాకింగ్ సిస్టం. రిమోట్ సాయంతోనూ స్కూటర్‌ను స్టార్ట్ /స్టాప్ చేయవచ్చు. ఈ స్కూటర్ పై 3సంవత్సరాలు లేదా 40వేల కిలోమీటర్ల వరకు వారంటి ఉంది.
ఈ ఫ్లూటో 7జీ ఎక్స్ షోరూం ధర సుమారు రూ.83,999/- మిగతా వివరాలకు కంపెనీ వెబ్‌సైట్ https://pureev.in/epluto/ లో సంప్రదించవచ్చు.
🖋️👍
Hai👌